సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించడంతో వరుణ్ గాంధీ పొలిటికల్ కెరీర్ ఇరాటకంలో పడింది. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. అయితే ఈ మధ్య వరుణ్ గాంధీ వాయిస్‌లో మార్పు వచ్చింది. సొంత పార్టీ బీజేపీపైనే ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో ఆయనకు ఈసారి టికెట్ లభించకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మూడుసార్లు యూపీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. నాలుగోసారి మాత్రం ఆయనకు టికెట్ రాకపోవచ్చనే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఆయన వ్యూహం మార్చారని తెలుస్తోంది.
బీజేపీ ఇటీవల రెండు విడతల్లో జాబితాను ప్రకటించింది. తొలి జాబితాలో 195 మంది.. రెండో జాబితాలో 72 మంది అభ్యర్థులను వెల్లడించింది. దాదాపు తొలి జాబితాలోనే యూపీ అభ్యర్థులను బీజేపీ ప్రకటించేసింది. కొన్ని స్థానాలు మాత్రమే పెండింగ్‌లో పెట్టింది. అయితే రెండు జాబితాల్లో వరుణ్ గాంధీ పేరు లేకపోవడంతో ఆయనకు ఈసారి మొండిచెయి ఎదురయ్యే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరిస్తే.. ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మేనకా గాంధీ, వరుణ్ గాంధీ ఎప్పటినుంచో బీజేపీలో ఉన్నారు. పిలిభిత్ లోక్‌సభ నుంచి వరుణ్ గాంధీ వరసగా మూడుసార్లు బరిలోకి దిగారు. ఈ సారి టికెట్ దక్కడం కష్టమేనని తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిపై వరుణ్ గాంధీ చేసిన కామెంట్ల వల్ల టికెట్ దక్కకపోవచ్చని సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది యోగి ఆదిత్యనాథ్‌పై వరుణ్ గాంధీ విమర్శలు చేశారు.
సొంత ప్రభుత్వంపై వరుణ్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో ఉత్తరప్రదేశ్ బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు టికెట్ రాకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ టికెట్ రాకుంటే స్వతంత్ర అభ్యర్థిగా వరుణ్ బరిలోకి దిగుతారని అతని సన్నిహితులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా? అసలు ఊహించి ఉండరు..
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి యూపీలో 51 స్థానాలకు బీజేపీ తొలి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించింది. మరో 24 సీట్లను ఖరారు చేయాల్సి ఉంది. అందులో వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిలిభిత్, ఆయన తల్లి మేనకా గాంధీ ఎంపీగా ఉన్న సుల్తాన్‌పుర్‌లు ఉన్నాయి. అయితే ఈసారి మేనకా గాంధీకి సుల్తాన్‌పుర్ ఖరారు చేసే అవకాశం ఉన్నప్పటికీ వరుణ్‌కు మాత్రం మొండిచేయి చూపొచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన స్థానంలో యూపీ మంత్రి జితిన్ ప్రసాద లేదా పిలిభిత్ ఎమ్మెల్యేకు చోటు కల్పించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ కూడా వరుణ్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అఖిలేష్ యాదవ్.. పార్టీలోకి ఆహ్వానించి టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లు పొలిటికల్‌గా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్సుంది.