NTV Telugu Site icon

R. Krishnaiah: ప్రభుత్వం తూతూ మంత్రంగా కులగణన చేసింది.. బీసీల సంఖ్యను తగ్గించారు!

R.krishnaiah

R.krishnaiah

తెలంగాణలో కులగణన తప్పుల తడక అని బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య విమర్శించారు. అన్ని ఇళ్లకు వెళ్లకుండా కులగణన చేశారని, ప్రభుత్వం తూతూ మంత్రంగా కులగణన చేసిందని మండిపడ్డారు. కులగణనలో బీసీల సంఖ్యను తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళితే ఒప్పుకోమని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పినకు అసెంబ్లీలో చట్టం చేయాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.

Also Read: Road Accident: జబల్‌పుర్‌ రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశం!

బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… ‘తెలంగాణలో కులగణన తప్పుల తడక. అన్ని ఇళ్లకు వెళ్లకుండా కులగణన చేశారు. ప్రభుత్వం తూతూ మంత్రంగా కులగణన చేసింది. కులగణనలో బీసీల సంఖ్యను తగ్గించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళితే ఒప్పుకోము. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పినకు అసెంబ్లీలో చట్టం చేయాలి. తప్పించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించకూడదు. తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమం జరుగుతుంది. బీసీలకు బడ్జెట్ ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు సరైన పోస్టులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు’ అని మండిపడ్డారు.