Site icon NTV Telugu

MP Laxman: ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగిన మూలాలు హైదరాబాద్‌లోనే..

Bjp Mp Laxman

Bjp Mp Laxman

MP Laxman: రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్న తెలంగాణకు సమాధానం చెప్పు.. కుట్రలు, పన్నగాలకు తెలంగాణ సమాజం సిద్ధంగా లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రెండేళ్లుగా అమలు కానీ హామీల కోసం ప్రజా వంచన కాంగ్రెస్ పాలనకు నిరసనగా ధర్నాచౌక్‌లో బీజేపీ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. రెండేళ్లలో ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు.. అమలు చేయక పోవడమే, వంచించడమే మీ గ్యారంటీ హా? అని ప్రశ్నించారు. ప్రజల్ని తప్పు దోవ పట్టించేందుకు తెలంగాణ రైసింగ్ , గ్లోబల్ సమ్మిట్ పెడుతున్నారని.. దృష్టి మరల్చడం రేవంత్ కు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. దేనిలో రైజింగ్ తెలంగాణ రేవంత్ రెడ్డీ.. గన్ కల్చర్ లో, అవినీతిలో, డ్రగ్ కల్చర్ లో తెలంగాణ రైజింగ్ హా అని నిలదీశారు.

READ MORE: Trudeau- Katy Perry: కెనడా మాజీ ప్రధాని ట్రూడో ప్రేమాయణం.. కన్ఫామ్ చేసిన అమెరికన్ సింగర్..

“మంత్రుల సిబ్బంది గన్ కల్చర్ ద్వారా ఆశిస్తున్నారు.. లాండ్ మాఫీయా రైజింగ్… పడగలెత్తుతుంది.. తెలంగాణ రైజింగ్ కాదు సింకింగ్ తెలంగాణ.. వాటాల పంపకంలో మంత్రుల మధ్య విభేదాలు.. శాంతి భద్రతల సమస్య.. ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగిన మూలాలు హైదరాబాద్‌లోనే ఉంటున్నాయి. రియల్ ఎస్టేట్ కుప్ప కూలి పోయింది.. తెలంగాణ అట్టుడికి పోతుంది.. మీ మోసాలు పరాకాష్ట కు చేరాయి.. తెలంగాణ సంపద దోచుకుంటూ డిల్లీకి కప్పం కడుతుంది.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారు.. అప్పుల విషయంలో గత ప్రభుత్వం తో పోటీ.. జీతాలు ఇవ్వని పరిస్థితి.. రిటైర్ అయిన ఉద్యోగులకు డబ్బులు ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది.” అని ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

READ MORE: AP Farmers: ఓవైపు తుఫాన్‌లు, మరోవైపు ధరలు.. అల్లాడిపోతున్న రైతులు!

Exit mobile version