NTV Telugu Site icon

BJP MP Laxman: మోడీ తెచ్చిన మహిళ బిల్లుకు అన్ని పార్టీలు సపోర్ట్ ఇవ్వాలి..

Laxman

Laxman

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చింది. దీనిపై బీజేపీ రాజ్యసభ్య సభ్యులు లక్ష్మణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ తెచ్చిన మహిళ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలపాలి.. మహిళాల అభ్యున్నతికి మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది.. బిల్లును వ్యతిరేకించేవారు రానున్న రోజుల్లో రాజకీయంగా పుట్టగతులు ఉండవు అని ఆయన తెలిపారు.

Read Also: Devil first single: కళ్యాణ్ రామ్ ను ‘మాయ’ చేసిన సంయుక్త!

బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ తెచ్చిన మహిళ రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఓటు వెయ్యాలి అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చెప్పే దానికి చేసే దానికి పొంతన ఉండదు అంటూ ఆయన పేర్కొన్నారు. మహిళ రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేసే బీఆర్ఎస్ మహిళల కోసం ఎన్ని సీట్లను కేటాయించిందో ప్రజలకు తెలుసు అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ మొదటి క్యాబినెట్ లో కనీసం ఒక్క మహిళ మంత్రి కూడా లేదు.. మీరు మహిళా బిల్లు మా పోరాటం వల్లే వచ్చిందంటూ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది.

Read Also: Andhra Pradesh Crime: ప్రాణం తీసిన చపాతీ గొడవ.. సుత్తితో కొట్టి చంపేశాడు..

గతంలో యూపీఏ హయాంలో బిల్లును ప్రవేశ పెట్టినప్పటికి దాని మిత్ర పక్షాలే ఈ బిల్లును అడ్డుకున్నాయి. రాజ్యసభలో ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే మాటలు కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏంటో నిరూపిస్తుంది అని లక్ష్మణ్ అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు తప్పకుండా ఆమోదం పొందుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.