NTV Telugu Site icon

Kangana Ranaut – Rahul Gandhi: కంగనా రనౌత్ ఏంటి రాహుల్ గాంధీని ఇలా చేసింది.. ఫోటో వైరల్..

Kangana Ranaut Rahul Gandhi

Kangana Ranaut Rahul Gandhi

Kangana Ranaut – Rahul Gandhi: బాలీవుడ్ నటి, ఎంపీ కంగన్ రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె వ్యక్తిగత జీవితం వల్ల కాదు. ఆమె సోషల్ మీడియా పోస్ట్‌ కారణంగా వార్తల్లో నిలుస్తోంది. కంగనా రనౌత్ మరోసారి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని తన ఇన్‌స్టా స్టోరీలో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఇది నిమిషాల వ్యవధిలో వైరల్ అయ్యింది. దింతో ప్రస్తుతం కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ ఫోటోలో రాహుల్ గాంధీ సాధారణంగా ముస్లింలు ధరించే టోపీని ధరించి, నుదుటిపై చందనం, తిలకం ధరించారు. అలాగే మెడలో శిలువ కూడా వేసుకుని ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చెక్కర్లు కొడుతుంది.

IND vs SL: భారత్‌తో రెండో వన్డే.. శ్రీలంకకు భారీ షాక్! 34 ఏళ్ల లెగ్ స్పిన్నర్ ఎంట్రీ

మార్ఫింగ్ చేసిన రాహుల్ గాంధీ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కంగనా రనౌత్ విపరీతంగా ట్రోల్ అవుతోంది. ఈ పోస్ట్‌కి క్యాప్షన్‌ లో కంగనా రనౌత్, “కులం అడగకుండానే కుల గణన చేయాల్సిన జాతి జీవి” అని రాశారు. నిజానికి, మండి లోక్‌సభ స్థానానికి చెందిన ఎంపీ కంగనా రనౌత్ కుల గణన గురించి రాహుల్ గాంధీ పార్లమెంటులో చేసిన ప్రకటనపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో ఈ ఇన్‌స్టా స్టోరీపై చాలా మంది కంగనా రనౌత్‌ను ట్రోల్ చేస్తున్నారు. చాలామంది కంగనా రనౌత్‌ను భారత పార్లమెంటుకు సరిపోని ‘ట్రోల్’ అని కామెంట్ చేసారు. “కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్ గాంధీ యొక్క బెల్ట్ మార్ఫింగ్ ఇమేజ్ క్రింద సిగ్గుపడేలా పోస్ట్ చేసింది. ఈసారి వారిని కోర్టుకు లాగాలి, ఆన్‌లైన్ ఎఫ్‌ఐఆర్ మాత్రమే సరిపోదు. ఈసారి శిక్ష లేకుండా వదిలివేయబడదు అంటూ కాస్త ఘాటుగా స్పందించారు.

Show comments