Site icon NTV Telugu

MP K Laxman : కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నాం.. క్లిన్ స్వీప్ చేయడమే బీజేపీ లక్ష్యం

K Laxman

K Laxman

BJP MP K Laxman About KCR National Political Party.

అధ్యక్షుడిగా నడ్డా పదవీ కాలాన్ని పొడిగించాలని పార్టీ లో ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదని బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. టీడీపీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని, ఏపీలో జనసేనతో ముందుకు సాగుతామన్నారు. బీజేపీలో చేరాలనుకునే ఎమ్మెల్యే లు ఇంకా టైమ్ ఉందని ఆగుతున్నారని, చేరికలు ఉంటాయని ఆయన తెలిపారు. కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామన్న లక్ష్మణ్‌.. తెలంగాణలో క్లిన్ స్వీప్ చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు.

 

పార్లమెంటరీ బోర్డు మెంబర్ గా నియమించడమే కేంద్రమంత్రి పదవితో భావిస్తున్నానని, వెంకయ్య నాయుడు తరువాత పార్లమెంటరీ బోర్డు మెంబర్ గా రెండో తెలుగు వ్యక్తిని అని ఆయన వెల్లడించారు. ఏపీలో అభివృద్ధి లేదు.. అక్కడ బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ తెలంగాణలోనే కాదు దేశంలో ఎక్కడా లేదని, బీజేపీలో చేరేందుకు మంత్రులు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్నారు. సమయం, అవసరాలరీత్యా టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారని, క్షేత్రస్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీలు బీజేపీలో చేరుతున్నారన్నారు.

Exit mobile version