వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన జయహో బీసీ సభపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. బీసీలను మోసం చేసిన వైసిపి ప్రభుత్వం బీసీలను ఉద్దరిస్తున్నామని బీసీ సభ పెట్టారు. జయహో బీసీ కాదు..భయహో బీసీ సభ పెట్టాలి. మా పాలనలో బీసీలను భయపెడతాం అని భయహో బీసీ సభ పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. నిధులు,వనరులు లేకుండా బీసీ కార్పొరేషన్లు పెట్టి బీసీలను మోసం చేశారు..50 శాతం పైగా ఉన్న బీసీలకు వైసిపి ఎన్ని సీట్లు ఇచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌ను ఖతం చేసేందుకు.. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పన్నాగం
చేనేత, పద్మశాలి,యాదవులకు టికెట్లు ఇవ్వలేదు. ఒక సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం జరుగుతుంది. రామచంద్రయాదవ్ పై దాడికి ముందు క్షమాపణలు చెప్పాలి. అలంకార ప్రాయమైన పదవులతో బీసీలకు ఒరిగింది ఏమి లేదన్నారు ఎంపీ జీవీఎల్. వైసీపీ పాలనలో భయ బ్రాంతులకు గురి చేసిన బీసీలకు క్షమాపణలు చెప్పాలి. ..లేదంటే భవిష్యత్ లో బీసీలు వైసీపీని నమ్మరన్నారు జీవీఎల్. ఏపీలో జగన్ ప్రభుత్వం ఇవాళ భారీ ఎత్తున బీసీ సభ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.
కొందరు నేనొస్తా అని మాట్లాడుతున్నారు. మోడీ సీఎంగా వున్నప్పుడు ఎన్ని పోర్టులు కట్టారు.. చంద్రబాబు ఒక్క పోర్ట్ కట్టారా? అన్నారు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. కేంద్రం ఇచ్చిన ఆర్ధిక సాయంతో మాత్రమే, పరిపాలన సాగుతోంది. వనరుల, ఇసుక దోపిడీ జరుగుతోంది. రాష్ట్రాన్ని దోచుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారు. అభివృద్ధి అనే ఎజెండాతో బిజెపి ముందుకు పోనుందన్నారు. కుటుంబపాలనకు బీజేపీ దూరంగా ఉంటుందన్నారు సోము వీర్రాజు.
Read Also:Weather Update: అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం
