Brij Bhushan: 11 జూన్ 2023 ఆదివారం గోండాలో BJP నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో BJP MP బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగించారు. తాను కైసర్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తాను అని తెలిపారు. తనపై భారత అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలను లేవనెత్తిన తర్వాత తన మొదటి ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు.
Read Also: Vallabhaneni Vamsi: చంద్రబాబుపై ఎమ్మెల్యే వంశీ ఫైర్.. అందుకే స్మశానం గుర్తొచ్చిందేమో!
ర్యాలీలో బ్రిజ్ భూషణ్ ఓ ఇంట్రెస్టింగ్ కవిత చెప్పారు. బాధ, కన్నీరు,మోసం, ప్రేమలపై సాగింది ఆ కవిత. ఈయనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రెజ్లర్ల పేర్లు ప్రస్తావించకుండానే ఈ మేరకు మాట్లాడారు. ‘కొన్నిసార్లు కన్నీళ్లనే తాగాల్సి రావొచ్చు. బాధను అనుభవించాల్సి ఉంటుంది. విషాన్నే మింగాల్సి పరిస్థితి ఎదురవ్వొచ్చు. అన్నీ భరిస్తేనే సమాజంలో మనుగడ సాగించగలం. నా ప్రేమకు దక్కిన ప్రతిఫలం ఇదే. కొందరు నన్ను తిడుతున్నారు. పొగుడుతున్నారు. నా పేరే నిత్యం పలుకుతున్నారు.’అంటూ కవిత వినిపించారు.
Read Also: Sanjay Raut: ఉద్ధవ్ ఠాక్రేకి బీజేపీ భయపడుతోంది.. అమిత్ షా “ద్రోహం” వ్యాఖ్యలపై కామెంట్స్..
అంతేకాకుండా 2024లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని బ్రిజ్ భూషణ్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పాలనలో దేశం కోల్పోయినదంతా ప్రధాని మోదీ తీసుకువస్తున్నారని అన్నారు. ముఖ్యంగా కాశ్మీర్‌లో జరిగిన పనులను, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న కృషిని సింగ్ ప్రశంసించారు. మరోవైపు బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలకు సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాలని ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.