Bandi Sanjay: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రి 2గంటల సమయంలో బాత్రూంలో కాలుజారి పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. కేసీఆర్ ఎడమకాలు తుంటి ఎముక విరిగిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. కాగా.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ట్వీట్ చేశారు. “తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గాయపడటం బాధాకరం. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని తెలిపారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు గాయపడటం బాధాకరం. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 8, 2023
Read Also: Supreme Court: ‘‘రెండు నిమిషాల లైంగిక సుఖం కోసం’’.. హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం..
మరోవైపు.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీపీఐ నారాయణ హరీష్ రావుకు ఫోన్ చేసి తెలుసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కేసీఆర్ ను కలిసి పరామర్శించారు. కాగా.. కేసీఆర్ ను మరికాసేపట్లో ఆపరేషన్ థియేటర్ కి తరలించేందుకు ఆస్పత్రి వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. 4.30 గంటలకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ నేతృత్వంలో హిప్ రీప్లేస్మేంట్ సర్జరీ చేయనున్నారు. దాదాపుగా 40కి పైగా వైద్యుల బృందం ఈ సర్జరీలో భాగం అవనున్నారు. అనస్థీషియా, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు పాల్గొననున్నారు. మరోవైపు ఆస్పత్రిలో.. మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు కూడా 9th ఫ్లోర్ లో ఉన్నారు.
Read Also: Supreme Court: ‘‘రెండు నిమిషాల లైంగిక సుఖం కోసం’’.. హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం..