Site icon NTV Telugu

Assembly Video: అసెంబ్లీలో పాడుపని చేస్తూ.. అడ్డంగా బుక్కయ్యారు..

Assembly

Assembly

Assembly Video: అసెంబ్లీ అనేది దేవాలయం వంటిది. అక్కడ రాష్ట్రంలోని ప్రజాసమస్యలను పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులు చర్చలు జరుపతుంటారు. ప్రజా సమస్యలను ప్రతిపక్షాలు లేవనెత్తడం.. అధికారపక్షం వాటిని తీర్చడం.. ప్రభుత్వాలు కీలక ప్రకటనలు చేయడం.. చట్టాలు రూపొందించడం అన్ని వాటిల్లోనే జరుగుతుంటాయి. అయితే దేశంలోని కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. కొందరు ప్రజాప్రతినిధులు తమ హోదాను మరిచి.. తాము ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నామన్న ఇంగిత జ్ఞానం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. సభలో కూర్చుని ప్రజలకు అవసరమైన పనులపై చర్చించాల్సిన నేతలు పాడు పనులు చేస్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించమని ఓట్లు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు చేసిన పని సభ్య సమాజం తలపంచుకునేలా ఉంది. ఇంతకీ వారేం చేశారో తెలుసా..

Shinzo Abe: క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల కంటే షింజో అబే వీడ్కోలుకు అధిక ఖర్చు.. ఎంతో తెలుసా?

ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. రాష్టంలో జరుగుతున్న కొన్ని ఘటనలపై ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. అయితే ఆ సమయంలో ఝాన్సీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే పొగాకు నములుతూ.. మహోబా ఎమ్మెల్యే వీడియో గేమ్‌ ఆడుతూ కెమెరాకు చిక్కారు. దీనికి సంబంధించిన వీడియో సమాజ్‌వాదీ పార్టీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సదరు ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఛీ..ఛీ.. అసెంబ్లీలో ఇదేం పని? అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. వీరికి ప్రజా సమస్యల కంటే ఇలాంటి పనికిమాలిన పనులు బాగా ఇష్టంలా ఉందని, ఇలాంటి వారు మన ప్రజాప్రతినిధులుగా కావడం దురదృష్టం అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు.

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ కూడా దీనిపై ట్విట్టర్‌లో స్పందించారు. యూపీ విధానసభలో బీజేపీ ఎమ్మెల్యేలు పేకాట ఆడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. ఈ వీడియోను రికార్డు చేసి వైరల్ చేయడం ద్వారా ప్రజా ప్రయోజనాల కోసం పని చేసిన ఇతర బీజేపీ ఎమ్మెల్యేలకు ధన్యవాదాలని పేర్కొన్నారు. ‘ఇప్పుడు సీఎం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఈ ఎమ్మెల్యేపై ‘మోరల్ బుల్డోజర్‌’ ఎప్పుడు నడుస్తుంది? అని ప్రశ్నించారు.

Exit mobile version