Site icon NTV Telugu

Opinion poll 2024: ఎన్డీయేకి 400 సీట్లు పక్కా.. తాజా సర్వేలో కీలక విషయాలు..

Modi

Modi

Lok Sabha seats: ఎన్డీయే కూటమి 400 లోక్ సభ స్థానాలను దక్కిచించుకుంటామనే నినాదం భారతీయ జనతా పార్టీకి మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని కూటమి 400కు పైగా సీట్లు గెలుచుకోవచ్చని తాజా సర్వేలో తేలింది. విశేషమేమిటంటే.. ఏ సర్వేలోనూ ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వచ్చే అవకాశం రావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ఇంకా ప్రకటించలేదు. అయితే, తాజాగా, Network18 సంస్థ చేపట్టిన మెగా ఒపీనియన్ పోల్ ప్రకారం NDA 411 సీట్లు గెలుచుకోగలదు అని తెలిపింది. లోక్‌సభలో మొత్తం సీట్ల సంఖ్య 543.. అందులో 370 సీట్లు గెలుస్తామని చెబుతున్న బీజేపీ లక్ష్యానికి దూరమయ్యే అవకాశం ఉంది.. ఈ ఎన్నికల్లో బీజేపీ 350 సీట్లు గెలుచుకోగలదని ఒపీనియన్ పోల్ డేటా చెబుతోంది. అసలు విషయం ఏమిటంటే.. ఇదే జరిగితే 2019 లోక్‌సభ ఎన్నికల కంటే బీజేపీ 47 సీట్లు ఎక్కువగా గెలుచుకోవడం ఖాయం అని చెప్పుకొవచ్చు.

Read Also: Electoral Bonds Data: ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలకు ఎంత నిధులు వచ్చాయి..?

కాగా, ఉత్తరప్రదేశ్‌లో 80 సీట్లకు గాను 77.. మధ్యప్రదేశ్‌లో 28, ఛత్తీస్‌గఢ్‌లో 10, బీహార్‌లో 38, జార్ఖండ్‌లో 12 సీట్లను ఎన్డీయే గెలుచుకోగలదని సర్వేలో తేలింది. కర్ణాటకలో 25, తమిళనాడులో 5, కేరళలో 2 సీట్లను కూడా ఎన్డీయే కూటమి గెలుచుకోగలదు అని చెప్పుకొచ్చింది. చాలా రాష్ట్రాల్లో ఎన్డీయే గ్రాఫ్ పెరిగే అవకాశాలున్నాయి. వీటిలో ఒడిశాలో 13, పశ్చిమ బెంగాల్‌లో 25, తెలంగాణలో 8, ఆంధ్రప్రదేశ్‌లో 18 సీట్లు గెలుచుకోవచ్చు అని పేర్కొనింది. గుజరాత్‌లోని మొత్తం 26 స్థానాలను ఎన్డీయే గెలుచుకోగలదు అని ఈ సర్వే పేర్కొంది. ఇక, ఒపీనియన్ పోల్ ప్రకారం విపక్ష కూటమికి 105 సీట్లు వస్తాయని తేలింది. అదే సమయంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు 49 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది అని తెలిపింది.

Exit mobile version