NTV Telugu Site icon

Karsevak Arrest: కరసేవకుల అరెస్ట్ పై బీజేపీ నేతల ఆందోళన

Bjp

Bjp

BJP leaders protest: కర్ణాటకలో కరసేవకుల అరెస్ట్ తర్వాత ఆ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. హుబ్లీ జిల్లాలో శ్రీకాంత్ పూజారి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 31 ఏళ్ల నాటి కేసులో అతడు అరెస్టయ్యాడు. అయితే, సిద్ధరామయ్య ప్రభుత్వం అరెస్టుకు వ్యతిరేకంగా కమలం పార్టీ గళం విప్పింది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రామభక్తులను ఉద్దేశ్యపూర్వకంగా వేధిస్తున్నదని బీజేపీ ఆరోపించింది.

Read Also: Kishan Reddy: రైతు భరోసాకు మళ్ళీ ధరకాస్తులు ఎందుకు?.. డేటా ప్రభుత్వం దగ్గర ఉంది..!

కాగా, శ్రీకాంత్ పూజారి అరెస్టును నిరసిస్తూ బీజేపీ నాయకుడు సీటీ రవి నగర పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. బీజేపీ నాయకులు తమ చేతుల్లో రామాలయం చిత్రం ఉన్న పోస్టర్‌ను పట్టుకుని కూర్చున్నారు. ఈ సందర్భంగా
శ్రీకాంత్ అరెస్టుపై కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర మాట్లాడుతూ.. ఎఫ్‌ఐఆర్‌, ఇతర పత్రాల్లో శ్రీకాంత్‌ పూజారి పేరు కరసేవకుడిగా నమోదు కాలేదు, నిందితుడిగా నమోదైంది, అతనిపై 16 కేసులు నమోదయినట్లు ప్రకటించారు. హుబ్లీలో ఓ షాప్ కి నిప్పంటించిన కేసులో శ్రీకాంత్ పూజారిని 1992 డిసెంబర్ 5న పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు.

Read Also: SKN: యంగ్ ప్రొడ్యూసర్ ఇంట విషాదం…

ఇక, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కరసేవకులపై కఠిన చర్యలకు పాల్పడుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు. సిద్ధరామయ్య ఇక్కడ ఐఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారా? లేక రాష్ట్రంలో మొఘల్, ఇస్లామిక్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? అంటూ విమర్శలు గుప్పించారు.