Site icon NTV Telugu

Delhi: ఎన్డీఏ మంత్రివర్గ కూర్పుపై కసరత్తు పూర్తి

Jp

Jp

త్వరలోనే కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడనుంది. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 9న సాయంత్రం 6 గంటలకు కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఇక ఎన్డీయే కూటమిలో భాగంగా ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పుపై శుక్రవారం జరిగిన కసరత్తు ముగిసింది. బీజేపీ జాతీయ అ‍ధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ అగ్రనేతల నేతృత్వంలో సుదీర్ఘంగా మంత్రివర్గ కూర్పుపై భేటీలు జరిగాయి. జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే భాగస్వామి పక్ష నేతలను ఒక్కొక్కరిని పిలిచి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌లు చర్చలు జరిపారు.

ఇది కూడా చదవండి: Kangana Ranaut: “తల్లి గౌరవం కోసం 1000 ఉద్యోగాలను వదులుకుంటా”.. కంగన రనౌత్‌ని కొట్టిన కుల్వీందర్ కౌర్..

ఎన్సీపీ చీఫ్‌ అజిత్ పవార్, శివసేన చీఫ్‌ ఏక్‌నాథ్‌ షిండేతో బీజేపీ అగ్ర నేతలు చర్చించారు. అనంతరం టీడీపీ చీఫ్‌ చంద్రబాబుతో మంత్రివర్గంపై చర్చలు జరిపారు. అయితే మంత్రివర్గం కూర్పు ఫైనల్‌ అయిందా? లేదా? అనే అంశంపై అధకారికంగా స్పష్టత రాలేదు. ఇక ఎన్డీయే పక్ష నేత నరేంద్ర మోడీ ఎల్లుండి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అందుకోసం శుక్రవారం భాగస్వామ్య పక్ష నేతలు మోడీని ఏకగ్రీవంగా ఎన్డీయే పక్షనేతగా ఎన్నుకున్నారు. కూటమి నేతలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మోడీని రాష్ట్రపతి ఆహ్వానించారు.

ఇది కూడా చదవండి: Bhatti Vikramarka: స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి..

Exit mobile version