Site icon NTV Telugu

Tirupati Reddy Kidnap : తిరుపతిరెడ్డి కిడ్నాప్‌.. లాస్ట్‌ అక్కడే కనిపించాడు

Kidnap

Kidnap

తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి తిరుపతిరెడ్డి కిడ్నాప్‌కు గురైనట్లు సమాచారం. హైదరాబాద్‌లోని అల్వాల్‌లో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేశారు. తన భర్త కిడ్నాప్‌కు గురయ్యాడని అతని భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుపతిరెడ్డి స్వస్థలం జనగాం జిల్లా దుబ్బకుంటపల్లి. అతను హైదరాబాద్‌లోని కుషాయిగూడలో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. 5,929 గజాల స్థలం విషయంలో తన ప్రత్యర్థులతో తనకు వివాదం ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సుజాత పేర్కొంది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అల్వాల్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో కిడ్నాప్‌కు గురయ్యాడు. అతడిని ప్రత్యర్థులు కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న తిరుపతిరెడ్డి జనగాం టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : Boora Narsaiah Goud : కేసీఆర్‌ బీసీలను అష్ట దిగ్బంధనం చేస్తున్నారు

పోలీసుల వివరాల ప్రకారం.. నిన్న ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ఫార్చ్యూనర్ కారులో దిగాడు తిరుపతి రెడ్డి.. ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర దిగిన ఐదు నిమిషాల్లోనే ఒక ఆటోలో సెల్ఫ్ గా తిరుపతిరెడ్డి ఎక్కి వెళ్లినట్లు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యింది. అయితే.. ఆటోను 700 రూపాయలతో రెంట్ కి మాట్లాడుకుని ఘట్‌కేసర్ వైపు వెళ్లారు. ఘట్‌కేసర్ టౌన్ లో దింపినట్లు చెప్పిన ఆటో డ్రైవర్ వెళ్లడించాడు. అక్కడ నుంచి ఎక్కడ వెళ్ళారు అని పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఘట్‌కేసర్ టౌన్ సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నాలుగు టీమ్స్ గా ఎస్వోటి, అల్వాల్ పోలీసులు వెతుకుతున్నారు.

Also Read : Allu Sirish: ఆ హీరోయిన్ తో అల్లు శిరీష్ ప్రేమాయణం..?

Exit mobile version