NTV Telugu Site icon

subramanya swamy: కేంద్ర క్యాబినెట్ పై బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి కీలక వ్యాఖ్యలు

Suramanya Swamy10

Suramanya Swamy10

లోక్‌సభ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న వేళ మోడీ సర్కార్‌పై బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ క్యాబినెట్‌లో ఇద్దరు (రాజ్‌నాథ్‌, గడ్కరీ) తప్ప.. మిగతా వారంతా ‘యెస్‌’ అంటూ తలూపేవారేనని విమర్శించారు. లఢక్‌లో నెలకొన్న పరిస్థితిపై కేంద్రం నిజాయితీగా లేదన్నారు.

READ MORE: Woman’s Body Found: యూనివర్సిటీలోని వాటర్ ట్యాంక్‌లో మహిళ మృతదేహం.. ఏమైందంటే?

ఎన్నికల బాండ్ల పథకం అతిపెద్ద కుంభోణమని, దీని నుంచి ప్రధాని మోదీ తప్పించుకోలేరని ఆయన అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుబ్రమణ్య స్వామి పై ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ సర్కార్‌ క్యాబినెట్‌ మంత్రులపై మాట్లాడుతూ.. ‘వారికి మంత్రులు అయ్యే అర్హతల్లేవు. రాజ్‌నాథ్‌, గడ్కరీ తప్ప, క్యాబినెట్‌లో మిగతావారంతా వెన్నెముక లేనివారే. అలాంటి వారినే మోడీ ఎంచుకున్నారు’ అని స్వామి అన్నారు. కాగా.. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కూటమి పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఓ కేసులో తిరుపతి కోర్టుకు హాజరైన ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గతంలో సోనియా గాంధీని కూడా కలిశారన్నారు. ఏపీ సీఎం జగన్ చాలా హర్డ్ వర్క చేస్తున్నారని.. సార్వత్రిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తారని చెప్పారు.