NTV Telugu Site icon

Viral Video: కారు ఢీకొని బీజేపీ నాయకుడి ఆరేళ్ల కుమారుడు మృతి

Car Accident

Car Accident

Viral Video: ఛత్తీస్‌గఢ్‌ లోని అంబికాపూర్‌లో గురువారం (అక్టోబర్ 17) సాయంత్రం సమయంలో బీజేపీ నాయకుడు ధీరజ్ సింగ్ దేవ్ 6 ఏళ్ల కుమారుడుని ఎస్‌యూవీ కారు ఢీకొని మృతి చెందాడు. చిన్నారిని అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిన్నారితో పాటు కొందరు పిల్లలు, తన అత్త ఇంటి బయట ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో బాలుడు ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో కారు అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడం కనిపించింది. దాంతో ఆ కారు బాలుడిని ఢీకొట్టడంతో, పిల్లడు నేలపై పడిపోయాడు. దాంతో కారు పిల్లవాడిపైకి దూసుకెళ్లింది.

Read also: Khalistani Terrorist: ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్ హత్యకు భారత రా అధికారి కుట్ర చేశారు: అమెరికా

ఆ ఘటనతో అక్కడ ఉన్నవారు గట్టిగా అరవడంతో చిన్నారి తండ్రి, తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని మొదట సంజీవని ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని బిలాస్‌పూర్‌ లోని అపోలో ఆస్పత్రికి తరలించగా నేటి ఉదయం మృతి చెందాడు. స్థానికులు, పిల్లల కుటుంబ సభ్యుల నిరసన తర్వాత ఎస్‌యూవీ కారు డ్రైవర్‌ను అరెస్టు చేసి, అనంతరం గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాద ఘటనతో మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.

Read also: Railway Ticket Booking: ఇకపై 60 రోజుల ముందే రైలు బుకింగ్‌ల ముందస్తు రిజర్వేషన్

Show comments