NTV Telugu Site icon

JC Prabhakar Reddy: జేసీ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి: సందిరెడ్డి

Sandireddy Srinivasulu

Sandireddy Srinivasulu

తాడిపత్రిలో జరిగిన నూతన సంవత్సర వేడుకలు రాజకీయ రచ్చగా మారాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు మాత్రమే అంటూ నిర్వహించిన వేడుకలప్తె బీజేపీకి చెందిన యామిని శర్మ, మాధవీ లతలు చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. ఈ ఇద్దరు మహిళా నాయకులప్తె జేసీ వర్గీయులు విరుచుకుపడ్డారు. నియోజకవర్గ ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో టీడీపీ కౌన్సీలర్లు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో జేసీ ట్రావెల్స్‌కు సంబంధించి బస్సు దగ్థం కావడంప్తె బీజేపీని ఉద్థేశించి జెసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

మాధవీ లతను ప్రాస్టిట్యూట్ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు బీజేపీ నేతలు మాధవీ లతని ఎందుకు పెట్టుకున్నారో తెలియదు, ఆమె పెద్ద వేస్ట్‌ అంటూ ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యలప్తె అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు స్పందించారు. బీజేపీ నాయకురాలు మాధవీలతపై జేసీ మాట్లాడిన వ్యాఖ్యలు చాల జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. ‘అధికార పార్టీలో ఉండి ఏం మాట్లాడుతున్నారో జేసీ ప్రభాకర్ రెడ్డి గ్రహించుకోవాలి. మీ వయసు పెద్దది, అలాగే మీ ప్రవర్తన ఉండాలి. కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే విధంగా మీ ప్రవర్తన ఉంది. జేసీ వ్యాఖ్యల్ని బీజేపీ ఖండిస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలకు ఎవరూ భయపడరూ. బస్సుల దహనం లాంటి కార్యక్రమాన్ని బీజేపీ ఎప్పుడు ప్రోత్సహించదు. మీ వ్యాఖలను వెనక్కి తీసుకుంటే గౌరవంగా ప్రదంగా ఉంటుంది’ అని సందిరెడ్డి ఫైర్ అయ్యారు.

Show comments