Site icon NTV Telugu

Rapolu Ananda Bhaskar: బీజేపీకి బిగ్‌ షాక్‌.. గులాబీ గూటికి మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్

Rapolu Ananda Bhaskar

Rapolu Ananda Bhaskar

Rapolu Ananda Bhaskar: మునుగోడు ఉపఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు కమలదళంలో ఉన్న మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌ బీజేపీకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ నేత, ప‌ద్మశాలి సంఘ నాయ‌కుడు, సీనియ‌ర్ జ‌ర్నలిస్టు, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ ఆదివారం ప్రగ‌తి భ‌వ‌న్ లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖ‌ర్ రావుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చ‌ర్యల‌ను ఆయ‌న అభినందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ వేయ‌డం ప‌ట్ల ఆయ‌న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Minister KTR : చిన్న కంపెనీకి పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చిన పెద్ద మనుషులు ఎవరో అందరికీ తెలుసు

బీజేపీ పార్టీ చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తోంద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. నేత కుటుంబం నుంచి వ‌చ్చిన తాను బీజేపీ చేస్తున్న ఈ నిర్వాకాన్ని చూస్తూ భ‌రించ‌లేన‌ని, తాను బీజేపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతాన‌ని సీఎం కేసీఆర్‌తో చెప్పారు. రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న సంక్షేమ‌, అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయ‌ని ఆనంద భాస్కర్ కొనియాడారు. భారత రాష్ట్ర స‌మితి ద్వారా జాతీయ రాజ‌కీయాల్లో కేసీఆర్ కీల‌క పాత్ర పోషించాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

Exit mobile version