‘తెలంగాణ రాబందుల సమితి’ నేతలకు పిచ్చి పట్టిందని.. మతిభ్రమించి ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్. గురువారం ఎన్వీ సుభాష్ ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన.. ‘ అవినీతికి కేరాఫ్ అడ్రస్ టీఆర్ఎస్. టీఆర్ఎస్ నేతల అవినీతిపై చర్చకు ఎప్పుడైనా… ఎక్కడైనా సిద్ధమే. టీఆర్ఎస్ నేతలు నిజంగా నిజాయితీ పరులు, సత్యహరిచంద్రులే అయితే… మాతో చర్చకు రావాలి. పూర్తి ఆధారాలతో టిఆర్ఎస్ నేతల అవినీతిని నిరూపిస్తాం. టీఆర్ఎస్ పాలనలో వేల కోట్ల రూపాయలు ఎలా దండుకున్నారో ప్రజలు గమనిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు ప్రజలను గొర్రెలు అనుకుంటున్నారు. ప్రజలేమి తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఇకపై మీ పప్పులు ఉడకవు. కేసీఆర్ మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజా క్షేత్రంలో టిఆర్ఎస్ ను బొందపెట్టడం ఖాయం. బీజేపీ అభివృద్ధిపై, టిఆర్ఎస్ అవినీతిపై చర్చకు మేను సిద్ధం. మరి మాకు సవాల్ విసిరిన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ సిద్ధమేనా?. దమ్ముంటే చర్చకు రావాలి… లేదంటే మిమ్మల్ని అవినీతి పరులనే ప్రజలు భావిస్తారు. మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు, ప్రజల నుంచి వస్తున్న అద్భుత స్పందన చూసి, టిఆర్ఎస్ నేతల వెన్నులో వణుకు మొదలైంది.
Also Read : Palamuru Rangareddy Lift Irrigation Project: కేఆర్‌ఎంబీకి ఏపీ ఈఎన్సీ లేఖ.. పాలమూరు-రంగారెడ్డిపై ఫిర్యాదు
బండి సంజయ్ తన పాదయాత్రలో టిఆర్ఎస్ అవినీతిని ఎక్కడికక్కడ ఎండగడుతూ… కేంద్రం తెలంగాణకు ఇస్తున్న నిధులను లెక్కలతో సహా వివరిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా… టిఆర్ఎస్ బండారాన్ని, మా బండి సంజయ్ బయట పెడుతుండడంతో… కేసీఆర్ నిజ స్వరూపం ప్రజలకు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులను కేసీఆర్ ఎలా డైవర్ట్ చేస్తూ… అవినీతికి పాల్పడుతున్నారో… మా బండి సంజయ్ వివరిస్తున్నారు. “ప్రజా సంగ్రామ యాత్ర”కు ప్రజలు బ్రహ్మరథం పడుతుండడంతో… టిఆర్ఎస్ నేతల పీఠాలు కదిలిపోతున్నాయి. బండి సంజయ్ తన పాదయాత్రలో ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చకుండా… మోసం చేస్తున్నాడో… ఎక్కడికక్కడ ఎండ గడుతున్నారు. బండి సంజయ్ పేరు వింటేనే టిఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు.
Also Read : CM KCR : తెలంగాణ సర్కార్ తీపికబురు.. మరోసారి కంటి వెలుగు కార్యక్రమం
అభివృద్ధికి, పారదర్శక పాలనకు నిదర్శనం బీజేపీ. అవినీతి దొంగల భరతం పట్టడమే… భారతీయ జనతా పార్టీ లక్ష్యం. కేసీఆర్ అవినీతి, కుటుంబ, నియంతృత్వ, రజాకార్ల పాలనకు చరమగీతం పాడుతాం. తెలంగాణలో జరిగిన అభివృద్ధి అంతా… కేంద్ర ప్రభుత్వ నిధులతోనే. కేసీఆర్ కు దోచుకోవడం… దాచుకోవడం తప్ప, అభివృద్ధి అంటే ఏంటో కూడా తెలీదు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దండుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబ ప్రమేయం అంతా ప్రపంచానికి తెలిసింది. స్కామ్ లకు పెట్టింది పేరు… కేసీఆర్ కుటుంబం. అన్ని స్కామ్ లలో ఉన్నది కేసీఆర్ కుటుంబ సభ్యులే. మొన్న 4గురు ఎమ్మెల్యేల సినిమా అన్నాడు… ఇప్పుడు కూతురు పేరుతో కొత్త ట్రైలర్ కు తెర లేపాడు. కేసీఆర్ తన కూతురు కవితను బీజేపీ కొనాలని చూసిందని చెప్పడం హాస్యాస్పదం… జోక్ ఆఫ్ ది సెంచరీ’ అని ఆయన అన్నారు.
