Boora Narsaiah: తెలంగాణ రాష్ట్రంలో ఎందుకో కొత్త జబ్బు వచ్చిందని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కంటి చూపు జబ్బు వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలోనే కంటి చూపు సమస్య ఎందుకు వస్తుందో రీసెర్చ్ చేయాలని డబ్ల్యూహెచ్‌వోను కోరుతున్నామన్నారు. ఇది కంటి వెలుగా లేక ఎన్నికల ప్రచార వెలుగా అంటూ ఆయన విమర్శించారు.
NVSS Prabhakar: కేసీఆర్ కళ్లకి అద్దాలు పెట్టించి.. మోడీ అభివృద్ధిని చూపించాలి..
గత కంటి వెలుగు కార్యక్రమంలో 18 మంది అంధులు అయ్యారని మంత్రులను ఉద్దేశించి మాట్లాడారు. కంటి సమస్యలు నిరంతరం వస్తాయి.. ఎన్నికల అప్పుడే రావంటూ వ్యాఖ్యానించారు. ఇది కొవిడ్ లాంటి మహమ్మారి కాదన్నారు. గతంలో కొన్న మిషన్‌లు ఎటు పోయాయన్నారు. 50 కోట్లు కేవలం ప్రచారానికే పెడుతున్నారని విమర్శించారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లలో కూడా పేపర్ యాడ్‌లు ఇస్తున్నారని ఆయన అన్నారు. ఎంత మంది కొత్త కంటి డాక్టర్‌లను రిక్రూట్ చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు.
