PM Modi : తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు వరుస ఎన్నికల పర్యటనలు సిద్దమవుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కనీసం పది ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ప్రచారాన్ని ప్రారంభించకముందే ముమ్మరంగా ప్రచారం చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. ఆ మేరకు ఆ పోటీలకు అభ్యర్థుల ప్రకటనకు ముందే.. ఈ నెలాఖరులోగా అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారం చేసేందుకు బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించి సభలు నిర్వహించేందుకు సన్నద్దం మవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఆదిలాబాద్, సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలను ప్రధాని మోడీ సందర్శించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
Read Also:CPI Narayana: ప్రజా సమస్యలను వదిలేసి.. ప్రధాని రాజకీయాలు మాట్లాడుతున్నారు!
వచ్చే నెల 4న హైదరాబాద్ లో అమిత్ షా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. ముందుగా రాష్ట్ర పర్యటన ఖరారైతే.. అదే రోజు అమిత్ షాకు బదులు మోడీ సభ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశానికి గచ్చిబౌలి, సరూర్‌నగర్ స్టేడియంలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 17 ఎంపీ నియోజకవర్గాల్లో (ఐదు వేర్వేరు నియోజకవర్గాల్లో) విజయసంకల్పయాత్రల ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో మార్చి 2న అమిత్ షా సభతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని తొలుత భావించారు. కానీ అనూహ్యంగా అమిత్ షా పర్యటన రద్దయింది. 4వ తేదీ మోడీ రాష్ట్రానికి రానున్నారు. ఈ క్రమంలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలుస్తోంది.
Read Also:YSR Rythu Bharosa: వరుసగా ఐదో విడత రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్..
ప్రధాని మోడీ షెడ్యూల్
* మార్చి 4, 5తేదీల్లో తెలంగాణ లో మోడీ టూర్
* 4వ తేదీన అదిలాబాద్, 5వ తేదీన సంగారెడ్డిలో పర్యటన
* 4వ తేదీ ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు అదిలాబాద్ లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం.
* ఉదయం 11.15 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అదిలాబాద్లో పబ్లిక్ మీటింగ్
* సాయంత్రం తమిళనాడుకు పయనం
* రాత్రి హైదరాబాద్ రాజ్ భవన్ లో బస
5 వ తేదీన సంగారెడ్డి
* ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ నుండి బయలు దేరనున్న మోడీ
* ఉదయం 10. 45 నుండి 11.15 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపన లు, ప్రారంభోత్సవాలు
* ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.15 వరకు బీజేపీ బహిరంగ సభ
* తెలంగాణ పర్యటన తర్వాత ఒడిషా వెళ్లనున్న పీఎం
