హిమాచల్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రైతుల ఉద్యమం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటన తర్వాత.. ప్రతిపక్షాలు బీజేపీని తీవ్రంగా లక్ష్యంగా చేసుకుని కంగనాపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. పెరుగుతున్న వివాదాల మధ్య కంగనా చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. భవిష్యత్తులో అలాంటి ప్రకటన చేయకూడదని కంగనాను హెచ్చరించింది.
READ MORE: Ongole: అమ్మతనానికి కలంకం.. పది వేలకు శిశువును అమ్మకానికి పెట్టిన తల్లి
వాస్తవానికి.. బీజేపీ అగ్రనాయకత్వం బలంగా లేకుంటే.. పంజాబ్ రైతుల ఉద్యమం వల్ల భారత్ మరో బంగ్లాదేశ్‌గా మారేదని కంగనా రనౌత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కంగనా రనౌత్ చేసిన ఈ ప్రకటనపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఎన్ఎస్ఏ కింద కంగనాపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అదే సమయంలో.. కంగనా ప్రకటనకు బీజేపీ దూరంగా ఉంది. ఇది ఆమె వ్యక్తిగత ప్రకటన అని, పార్టీకి దీనితో సంబంధం లేదని బీజేపీ పేర్కొంది.
READ MORE:Crime: ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత.. ప్రేమికుడిని ముక్కలుగా నరికి హత్య!
కంగనా వివాదాస్పద ప్రకటనపై బీజేపీ సెంట్రల్ మీడియా విభాగం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రైతు ఉద్యమ సందర్భంలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇచ్చిన ప్రకటన పార్టీ అభిప్రాయం కాదన పేర్కొంది. కంగనా రనౌత్ ప్రకటనతో భారతీయ జనతా పార్టీ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది. కంగనా రనౌత్‌కు అలాంటి ప్రకటనలు చేయడానికి అనుమతి, అధికారం లేదు అని ప్రకటనలో తెలిపింది.
READ MORE: Fire Accident: బాపట్ల జిల్లా కర్లపాలెంలో అగ్నిప్రమాదం.. పేదల గుడిసెలు దగ్ధం
రైతుల ఉద్యమంపై కంగనా రనౌత్ ఏమన్నారు?
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మన అగ్రనాయకత్వం బలహీనంగా ఉంటే భారత్‌లో బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి వచ్చి ఉండేది. రైతుల ఉద్యమ సమయంలో ఏం జరిగిందో అందరూ చూశారు. ప్రదర్శనల పేరుతో హింసకు పాల్పడ్డారు.” అని పేర్కొన్నారు.