NTV Telugu Site icon

Somu Veerraju: ఏపీలో రాహుల్ పాదయాత్రపై బీజేపీ అభ్యంతరం

somu1

Ffhmcg6ayaecwo7

ఏపీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. రాహుల్ గాంధీ అనే వ్యక్తి .. ఏపికి అన్ని విధాలుగా నష్టం చేసిన వ్యక్తి.. ఏపిలో పాదయాత్ర చేసే హక్కు రాహుల్ గాంధీకి లేదు. భద్రాచలాన్ని … ఏపిలో ఉంచకుండా తెలంగాణ లో కలిపారన్నారు ఒంగోలులో సోము వీర్రాజు. ఏపీ అన్ని విధాలుగా అభివృద్ది చెందేందుకు కేంద్రం సహకరిస్తుంది.

Read Also: RRR In Japan: జపాన్‌లో RRR క్రేజ్‌.. అస్సలు తగ్గడం లేదుగా..

వికేంద్రీకరణ పేరుతో వైసీపీ రాజకీయం చేస్తోంది.. అమరావతి రాజధానికి కేంద్రం కట్టుబడి ఉంది. వివాదాలతో రాష్ట్రం అభివృద్ధి నోచుకోకుండా వైసీపీ చేస్తోంది. డిసెంట్రలైజేషన్ పేరుతో జగన్ చెప్పేది బూటకం. వైసీపీ ప్రభుత్వం విశాఖలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. విశాఖలో వైసీపీ నాయకులు భూములు ఆక్రమిస్తున్నారు.

చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ తో ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం కలిశారు.పొత్తులపై పవన్ కళ్యాణ్..చంద్రబాబు మధ్య చర్చకు రాలేదు.ప్రస్తుతానికి జనసేన, బిజెపి పొత్తులో ఉన్నాయి.ఏపిలో దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయి… దేవాలయాలపై దాడులు జరిగిన పోలీసులు లైట్ తీసుకుంటున్నారు.. ఇక్కడ ఎస్సీ స్పందన సరిగ్గా లేదని అసహనం వ్యక్తం చేశారు. బిజెపి దేవాలయాల దాడులపై పోరాడితే .. పోలీసులు బెదిరిస్తున్నారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేయి విరిగినప్పుడు… వైసీపీ రాద్దాంతం చేసింది.. దేవాలయాల ద్వసం చేస్తే వైసీపీ ప్రభుత్వం స్పందించదన్నారు సోము వీర్రాజు.

Read Also: RRR In Japan: జపాన్‌లో RRR క్రేజ్‌.. అస్సలు తగ్గడం లేదుగా..