Site icon NTV Telugu

BJP Candidate List: నేడు బీజేపీ తొలి జాబితా.. లిస్ట్‌లో మోడీ, అమిత్‌ షా!

Pm Modi

Pm Modi

BJP Candidate List for Lok Sabha Elections 2024: పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రచారాలు కూడా మొదలెట్టింది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండంతో త్వరలోనే అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రధాని మోడీ సారథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) గురువారం సమావేశం అయింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము మూడింటి వరకు కమిటీ చర్చలు జరిపింది. ఈ రోజు ఏ క్షణమైనాఎప్పుడైనా తొలి జాబితా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

గురువారం జరిగిన చర్చల్లో యూపీ, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, కేరళ, తెలంగాణలోని స్థానాలపై సీఈసీ దృష్టి పెట్టినట్లు తెలిసింది. మిగతా రాష్ట్రాల్లో సీట్లపై ప్రాంతీయ పార్టీలతో అంగీకారం కుదిరిన తర్వాత ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇక నేడు రిలీజ్ అయ్యే లిస్ట్‌లో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సహా 100 మంది పేర్లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. చాలామంది సిటింగ్‌ ఎంపీలకే టికెట్లు దక్కనున్నాయట. ప్రధాని మూడోసారి వారణాసి స్థానం నుంచి పోటీ చేయడం ఖాయం. 2014లో 3.7 లక్షలు, 2019లో 4.8 లక్షలు మెజార్టీతో మోడీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ వారణాసి నుంచి పోటీ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Also Read: Bhoothaddam Bhaskar Narayana Review: భూతద్ధం భాస్కర్ నారాయణ రివ్యూ

గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పోటీ చేయొచ్చని తెలుస్తోంది. కీలక అమేఠీ స్థానం గురించి గురువారం జరిగిన మీటింగ్‌లో చర్చకు వచ్చినట్లు సమాచారం. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అమేఠీ నియోజకవర్గం నుంచి స్మృతి ఇరానీని బరిలోకి దించాలని బీజేపీ చూస్తోందట. మరోవైపు కాంగ్రెస్-ఇండియా కూటమిలోని ఇతర పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు ఇంకా పూర్తికాలేదు.

Exit mobile version