Site icon NTV Telugu

Eknath Shinde : సీఎంగా తప్పుకోవాలని షిండేకు బీజేపీ హుకుం.. కొత్త సీఎం ఎవరు..?

Eknath Shinde

Eknath Shinde

మహారాష్ట్రకు తొందరలోనే కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారని ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్యాస్ట్రో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారాయి. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని కమలం పార్టీ ఏక్ నాథ్ షిండేకు హుకుం జారీ చేసిందని.. దీంతో ఆయన మనస్తాపంతో మూడు రోజుల పాటు సెలవులు పెట్టి వెళ్లారని క్యాస్ట్రో అన్నారు. అయితే మీడియా వర్గాలు తనకు ఈ విషయంనూ కచ్చితమైన సమాచారం అందించాయని క్లైడ్ క్యాస్ట్రో అన్నారు.

Also Read : MM Keeravani: స్టార్ హీరోస్ తో కీరవాణి సెంటిమెంట్!

సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లు తమ బాధ్యతలు మార్చుకోవాలని బీజేపీ చెప్పిందని క్యాస్ట్రో తెలిపారు. త్వరలోనే దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఏక్ నాథ్ షిండే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని క్లైడ్ క్యాస్ట్రో చెప్పుకొచ్చాడు. ఇది నిజమేనా.. షిండే, ఫడ్నవీస్ తమ పదవులు మార్పుకోబోతున్నారని మీడియా వర్గాలు చెబుతున్నాయి.. ఈ విషయం గురించి ఢిల్లీలో మీటింగ్ కూడా జరిగిందట.. బీజేపీ పదవి మార్చుకోమని తనకు చెప్పడం ఇష్టం లేక షిండే మూడు రోజులు సెలవు పెట్టి వెళ్లారా అని క్లైడ్ క్యాస్ట్రో ట్విట్ చేశారు.

Also Read : Ponniyin Selvan 2: మణిరత్నం ఎందుకలా చేశారు!?

రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి గతేడాది ఉద్దవ్ ఠాక్రేపై తిరుగుబావుటా ఎగురవేసి బీజేపీతో ఏక్ నాథ్ షిండే చేతులు కలిపారు. ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే షిండేను బీజేపీ బెదిరించిందని.. తమతో చేతులు కలపకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలతో అరెస్ట్ చేయిస్తామని బ్లాక్ మెయిల్ చేసిందని ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఇటీవలే చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బీజేపీతో కలిసి వెళ్లడానికి ముందు షిండే తమ ఇంటికి వచ్చి ఏడ్చారని ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు.

Exit mobile version