గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఈ విమానం దగ్గర్లోని బీజే మెడికల్ కాలేజీ భవనంపై కుప్పకూలింది. విమానంలోని 241 ప్రయాణికులే కాకుండా.. హాస్టల్‌లో ఉన్న 24 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఓ ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే.. ఈ ప్రమాదం నుంచి ఓ వైద్య విద్యార్థి చాకచక్యంగా తప్పించుకున్నాడు. తాజాగా తమిళనాడు రాష్ట్రం చెన్నైకి చెందిన డాక్టర్ అరుణ్ ప్రశాంత్ మీడియాతో మాట్లాడుతూ.. తన అనుభవాలను పంచుకున్నారు. తాను ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు వెల్లడించారు.
READ MORE: WTC Final: మరోసారి మెరిసిన రబాడ.. రెండో ఇంనింగ్స్ లో ఆసీస్ ఆలౌట్.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?
“మధ్యాహ్నం 1:30 భోజనం చేసేందుకు 5వ అంతస్తులో ఉండే మెస్ కు వెళ్ళాం. ఒక్కసారిగా భారీ శబ్ధం రావడం, దట్టమైన పొగ కమ్ముకోవడంతో వెంటనే కిందకి పరుగులు తీశాను. ఏం జరుగుతోందో నాకు అర్థం కాలేదు. మొదటి అంతస్తుకి చేరుకుని అక్కడి నుంచి దూకి నా ప్రాణాలు కాపాడుకున్నాను. నాతో పాటు 20- 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా కొన్ని కుటుంబాలు లోపలే ఉన్నాయి. బయటకి వచ్చి చూసిన తరువాతే విమానం కూలిందని అర్థమైంది.” అని అరుణ్ వెల్లడించాడు.
READ MORE: Air Crash: సంజయ్ గాంధీ, విజయ్ రూపానీ, వైఎస్ఆర్.. విమాన ప్రమాదాల్లో మరణించిన రాజకీయ నేతలు..
