NTV Telugu Site icon

Flying Saucer: టర్కీలో ఫ్లైయింగ్ సాసర్.. గ్రహాంతర వాసులొస్తున్నారని భయాందోళన

Flying Saucer

Flying Saucer

Flying Saucer: టర్కీ దేశంలో ఇటీవల అద్భుతం చోటుచేసుకుంది. బుర్సా పట్టణ వాసులకు గురువారం ఉదయం ఆకాశంలో ఫ్లైయింగ్ సాసర్ ఆకారం కనిపించింది. దీంతో అందరూ దానిని గ్రహాంతరవాసులు ఉపయోగించే వాహనంగా పరిగణించారు. గ్రహాంతరవాసులు నేలపైకి వస్తున్నారేమోనని చాలామంది భయపడ్డారు కూడా.. కానీ కాసేపటి తర్వాత అది ఫ్లైయింగ్ సాసర్ కాదని తేలిపోయింది. ఓ భారీ మేఘం ఇలా విచిత్రమైన ఆకారందాల్చిందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు పట్టణ వాసులు. కొంతమంది ఈ వింతను తమ కెమెరాలలో బంధించారు.

Read Also: Dera Baba: పెరోల్ పై బయటకు వచ్చిన బాబా.. మరి ఈ సారి డేరా ఎక్కడో

ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంతో.. ఇప్పుడు అవి వైరల్ గా మారాయి. ఆకాశంలో ఈ వింత మేఘాలు ఏర్పడడంపై టర్కీ మెటరలాజికల్ సంస్థ ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఇలాంటి మేఘాలు రెండు వేల నుంచి 5 వేల మీటర్ల ఎత్తున్న పర్వత ప్రాంతాల్లో మాత్రమే ఏర్పడతాయని చెప్పారు. ఎత్తైన ప్రదేశాల్లో గాలుల వేగం క్షణక్షణానికీ మారుతుందని, బలమైన గాలులు వీస్తూన్నప్పుడు ఉన్నట్టుండి ప్రశాంతత నెలకొంటుందని చెప్పారు. గాలి వేగంలో చోటుచేసుకునే అసాధారణ మార్పులవల్లే ఇలాంటి అసాధారణ మేఘాలు ఏర్పడతాయని వివరించారు. ఈ మేఘాలు కనిపించాయంటే ఆ రోజు లేదా ఆ మరుసటి రోజు వర్షం కురుస్తుందని చెప్పారు.

Show comments