NTV Telugu Site icon

Bitcoin Price: లక్ష డాలర్స్‌ను దాటేసిన బిట్‌కాయిన్.. అంతా ట్రంప్ వల్లనేనా?

Trump Bit Coin

Trump Bit Coin

Bitcoin Price: క్రిప్టో కరెన్సీలో భాగమైన బిట్‌కాయిన్‌ అల్ టైం రికార్డు సృష్టించింది. దింతో బిట్‌కాయిన్‌ విలువ లక్ష డాలర్లను దాటింది. ఇక అమెరికా ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత నూతన అధ్యక్షుడిగా ట్రంప్‌ విజయం సాధించనప్పటి నుండి దీని విలువ బాగా పెరుగుతోంది. మరోవైపు, ఎస్‌ఈసీ విభాగానికి క్రిప్టో అడ్వయిజర్‌ను అధిపతిగా ప్రత్యేకంగా నియమిస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం కారణంగా బిట్‌కాయిన్‌ విలువ భారిగా పెరిగింది. మార్కెట్ లో బిట్ కాయిన్ విలువ మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు పరిశోధకులు.

Also Read: Dedicated Commission: నేడు నిజామాబాద్ జిల్లాలో బీసీ డెడికేటెడ్ కమిషన్ పర్యటన..

బిట్‌కాయిన్ ఈరోజు అంటే డిసెంబర్ 5వ తేదీన 1 లక్ష డాలర్ల స్థాయిని దాటింది. నేడు బిట్‌కాయిన్ ధర 5.9% పెరిగి రికార్డు స్థాయిలో 1,01,438 డాలర్స్ కి చేరుకుంది. బిట్‌కాయిన్ ఇటీవలి కాలంలో ధరలో చాలా అభివృద్ధిని సాధించింది. క్రిప్టోకరెన్సీ పట్ల అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుకూల వైఖరి దీనికి ప్రధాన కారణం. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రిప్టోకరెన్సీ నియంత్రణ మరింత సులువుగా మారే అవకాశం ఉంది. ఇది కాకుండా, ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ కూడా బిట్‌కాయిన్‌ను బంగారంతో పోల్చడం వల్ల బిట్‌కాయిన్‌కు భారీ డిమాండ్ పెరిగింది. నవంబర్ 2024 నుండి బిట్‌కాయిన్ ధర సుమారు 140% పెరిగింది.