Bisleri on FSSAI Action: వాటర్ వివాదంపై బిస్లరీ వివరణ.. FSSAI చర్యలపై కీలక ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bisleri on FSSAI Action: ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లరీ (Bisleri) ఒక్క సారిగా సంచలనంగా మారింది.. సంస్థకు చెందిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ శాంపిల్ భద్రతా పరీక్షల్లో విఫలమవడంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) చర్యలకు సిద్ధమైంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 కింద బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ నేపథ్యంలో బిస్లరీ సంస్థ స్పందిస్తూ.. తమ నీరు తాగడానికి సురక్షితమేనని స్పష్టం చేసింది. ఈ వ్యవహారం సుమారు 14 నెలల క్రితం నాటిదని పేర్కొంది..
14 నెలల క్రితం నాటి బ్యాచ్‌పై వివాదం
బిస్లరీ సంస్థ వివరణ ప్రకారం.. 2025 సెప్టెంబర్‌లో గోవాలోని తమ తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేసిన ఒక బ్యాచ్‌కు సంబంధించిన శాంపిల్‌పై ఈ వివాదం మొదలైంది. దేశవ్యాప్తంగా తమకు 143 తయారీ కేంద్రాలు ఉండగా, వాటిలో గోవా ప్లాంట్ కూడా ఒకటని తెలిపింది. 2025 సెప్టెంబర్ 30న FSSAI అధికారులు గోవా తయారీ కేంద్రం నుంచి ఆరు శాంపిళ్లను సేకరించారు. వీటిలో ఐదు శాంపిళ్లు అన్ని నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలిందని కంపెనీ వెల్లడించింది. అయితే ఆరో శాంపిల్‌లో బ్రోమేట్ (Bromate) స్థాయి లీటరుకు 12 మైక్రోగ్రాములుగా నమోదైందని తెలిపింది. నిర్ణయించిన పరిమితి లీటరుకు 10 మైక్రోగ్రాములు మాత్రమే కావడంతో ఈ శాంపిల్‌పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని చెప్పింది..
Also Read
- Madhya Pradesh: ఆస్తి కోసం అమానుషం.. 80 ఏళ్ల తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు!
- Bisleri Water: మీరు తాగే బిస్లరీ వాటర్ సురక్షితమేనా? షాకింగ్ విషయాలు వెల్లడించిన FSSAI..
- Sabarimala Alert: అయ్యప్ప భక్తులకు అలర్ట్.. పంబా నదిలో బట్టలు పడేస్తే భారీ ఫైన్.. ఆ ఆచారానికి చెక్..
- PM Modi: 13 ఏళ్లలో 50 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి..
రీటెస్టింగ్లో మరో పదార్థం గుర్తింపు
ప్రాథమిక పరీక్ష ఫలితాలపై బిస్లరీ 2025 నవంబర్ 22న అప్పీల్ చేసుకుంది. దీంతో FSSAI ఆ శాంపిల్‌ను రిఫరల్ ల్యాబొరేటరీకి పంపించి మరోసారి పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో బ్రోమేట్ స్థాయి నిర్దేశిత పరిమితిలోనే ఉన్నట్లు తేలిందని బిస్లరీ తెలిపింది. అయితే అదే శాంపిల్‌లో పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు రిఫరల్ ల్యాబొరేటరీ గుర్తించిందని పేర్కొంది. రెండు పరీక్షల్లో వచ్చిన ఫలితాల మధ్య తేడాలు ఉండటంతో మరింత స్పష్టత అవసరమని బిస్లరీ భావించింది. అందుకే అదే శాంపిల్‌ను FSSAI ఆమోదించిన మరో స్వతంత్ర ల్యాబొరేటరీలో పరీక్షించామని వెల్లడించింది. ఆ పరీక్షలో కూడా బ్రోమేట్ స్థాయి నిర్ణయించిన పరిమితిలోనే ఉన్నట్లు నిర్ధారణ అయిందని పేర్కొంది ఆ సంస్థ..
FSSAI నుంచి తదుపరి సమాచారం రాలేదన్న బిస్లరీ
స్వతంత్ర ల్యాబొరేటరీ పరీక్షల ఫలితాలను 2026 ఫిబ్రవరి 2న అధికారిక లేఖతో పాటు FSSAI పశ్చిమ ప్రాంతీయ కార్యాలయానికి సమర్పించినట్లు బిస్లరీ వెల్లడించింది. అయితే ఆ తర్వాత FSSAI నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది. దీంతో ఈ వ్యవహారం ముగిసిపోయిందని తాము భావించినట్లు పేర్కొంది. తాజాగా వార్తల్లో వస్తున్న నోటీసు తమకు ఇమెయిల్ ద్వారా కానీ, నేరుగా కానీ అందలేదని బిస్లరీ స్పష్టం చేసింది. అంతేకాకుండా FSSAI వెబ్సైట్లో కూడా సంబంధిత నోటీసును గుర్తించలేకపోయామని తెలిపింది.
మా నీరు సురక్షితమే.. బిస్లరీ స్పష్టీకరణ
తాగునీటి భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని బిస్లరీ పేర్కొంది. తమ తయారీ ప్రక్రియలో 10 దశల నాణ్యత నియంత్రణ విధానాన్ని అనుసరిస్తున్నామని, ఇందులో 90కి పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించింది. వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీటిని అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఈ వ్యవహారంపై తగిన నియంత్రణ ప్రక్రియలో FSSAIకి పూర్తి సహకారం అందిస్తామని సంస్థ స్పష్టం చేసింది. ఎన్నో ఏళ్లుగా వినియోగదారుల నమ్మకాన్ని పొందిన బ్రాండ్‌గా బిస్లరీ కొనసాగుతోందని, తమ తాగునీరు వినియోగానికి సురక్షితమేనని పునరుద్ఘాటించింది. మొత్తంగా.. బిస్లరీ వాటర్ శాంపిల్ పరీక్షల ఫలితాలు, బ్రోమేట్, PAHs గుర్తింపు, రీటెస్టింగ్ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు FSSAI ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చినట్లు వార్తలు వస్తుండగా, మరోవైపు తమ స్వతంత్ర పరీక్షల్లో బ్రోమేట్ పరిమితుల్లోనే ఉందని బిస్లరీ వివరణ ఇస్తోంది. ఈ వ్యవహారంపై FSSAI నుంచి వచ్చే తదుపరి అధికారిక ప్రకటనపై ఆసక్తి నెలకొంది..


తాజావార్తలు
-
Bisleri on FSSAI Action: వాటర్ వివాదంపై బిస్లరీ వివరణ.. FSSAI చర్యలపై కీలక ప్రకటన!
-
Record: సుకుమార్ క్యాంప్‌లో కిరణ్ అబ్బవరం.. పోస్టర్ మిస్టరీ?
-
Tom Latham: మా అంచనాలు తప్పాయి.. ఒత్తిడిలోనూ ఆ ఇద్దరు అద్భుతంగా పోరాడారు!
-
Madhya Pradesh: ఆస్తి కోసం అమానుషం.. 80 ఏళ్ల తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
ట్రెండింగ్
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India A vs Pakistan A: భారత్‌కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!