Biryani Offer: ఇటీవల నూతనంగా ప్రారంభించిన రెస్టారెంట్లలో ఆకర్షణీయమైన ఆఫర్లతో భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక రూపాయి, రెండు రూపాయలకే బిర్యానీ అందిస్తూ రెస్టారెంట్లు ముందుగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో నూతనంగా ప్రారంభమైన ఓ రెస్టారెంట్ నిర్వాహకుడు కళ్లు చెదిరిపోయే బంపర్ ఆఫర్ పెట్టాడు. ఆ ఆఫర్ విన్న వాళ్లంతా లొట్టలేసుకుంటూ మరి ఆ రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు. కానీ నిర్వాహకులు ఓ షరతు పెట్టారు. ఆఫర్ కేవలం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే అంటూ కండీషన్ పెట్టడంతో జనం ఒక్కసారిగా దూసుకొచ్చారు.
Read Also: N convention : నాగార్జున పై కేసు నమోదు
ఇంతకీ ఆఫర్ ఏంటీ అనుకుంటున్నారా?.. కేవలం మూడు రూపాయలకే బిర్యానీ అంటూ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మూడు రూపాయల బిర్యానీ కోసం జనం బారులు తీరారు. మూడు రూపాయలు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ల కోసం భోజన ప్రియులు భారీ క్యూ లైన్లు కట్టారు. మూడు రూపాయల బిరియానీ కోసం వేలాది మంది జనం అక్కడకి చేరుకున్నారు. బిర్యానీ కోసం వచ్చిన జనంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది.