billionaire bunkers: సాధారణ ప్రజలకంటే కోట్లకు పడగలెత్తిన కుబేరులకు ప్రాణాలపై ఆపేక్ష ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వాదనకు ఓ ఉదాహరణకు బలం చేకూరుస్తుంది. యుద్ధం లేదా విపత్తు సమయాల్లో సామాన్య ప్రజల భద్రత కోసం బంకర్లు నిర్మిస్తారని మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ బంకర్లు బిలియనీర్లకు సూపర్-లగ్జరీ సురక్షిత గృహాలుగా మారుతున్నాయి. నిజం అండి బాబు.. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి.. యుద్ధం నుంచి మాత్రమే కాకుండా అణుదాడి, వాతావరణ మార్పు, ఏ ప్రమాదం సంభవించిన దాని నుంచి బయటపడి ప్రాణాలను కాపాడుకోడానికి ప్రస్తుతం బిలియనీర్లు భూగర్భ బంకర్లు నిర్మించుకుంటున్నారు.
READ ALSO: Sudarshan Reddy reply: ’40 పేజీల తీర్పును అమిత్‌షా చదవాలి’.. స్పందించిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి
సాధారణ బంకర్లు కావు..
బిలియనీర్ల కోసం రూపొందిచే బంకర్లు సాధారణమైనవి కాదు. అసలు ఏంటి దీని ప్రత్యేకత అంటే.. ఈ బంకర్లలో విలాసవంతమైన రిసార్ట్‌లలో ఉండే సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. వీటిల్లో భద్రత, అవసరమైన ఏర్పాట్లతో పాటు, స్పా, మంచి ఆహారం, పానీయాలు అందుబాటులో ఉండనున్నాయి. ఇటీవల అమెరికన్ కంపెనీ సేఫ్ ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో 1000 కి పైగా బంకర్లను నిర్మిస్తామని ప్రకటించింది. కంపెనీ ఈ ప్రాజెక్ట్‌కు ఏరీ అనే పేరు పెట్టింది. ఏరీ అంటే.. డేగ గూడు అని అర్థం.
కొన్ని సంవత్సరాల క్రితం మెటా యజమాని మార్క్ జుకర్‌బర్గ్ హవాయిలో ఇలాంటి భారీ కాంప్లెక్స్‌ను నిర్మించే ప్రణాళికలను ప్రకటించారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కూడా అలాంటి సన్నాహాలలో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఈ మార్కెట్ నిరంతరం పెరుగుతోందని, బిలియనీర్లలో దీని డిమాండ్ వేగంగా వ్యాప్తి చేందుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సేఫ్ కంపెనీ ఆపరేషన్స్, మెడికల్ ప్రివెన్షన్ డైరెక్టర్ నవోమి కార్బీ మాట్లాడుతూ.. ఈ బంకర్లు ఒక రకమైన ప్రత్యేకమైన క్లబ్‌గా ఉంటాయని తెలిపారు.
బంకర్ లోపల జైలు..
బంకర్లలో ఆసక్తికర విశేషం ఏమిటంటే.. ప్రతి బంకర్‌లో ఒక చిన్న జైలు కూడా ఉంటుంది. లోపల ఉన్న వాళ్లలో ఎవరైనా తప్పు చేస్తే వారిని ఈ జైలులో ఉంచడానికి వీలుగా దీనిని నిర్మిస్తున్నారు. కానీ ఈ జైలు ఆధునిక నిర్బంధ కేంద్రంలా ఉంటుందని కార్బీ చెప్పారు. ఈ బంకర్లకు SCIF (సెన్సిటివ్ కంపార్ట్‌మెంటేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫెసిలిటీ) హోదా ఇవ్వబడిందని పేర్కొన్నారు. అంటే వాటి భద్రత వైట్ హౌస్ క్రైసిస్ రూమ్ లాగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పరిస్థితులతో ఈ బంకర్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోందని ఆమె పేర్కొన్నారు.
పరిమాణంపై ఆధారపడి ధర..
ఈ బంకర్ల ధర వాటి పరిమాణంపై ఆధారపడి ఉంటుంది సేఫ్ కంపేనీ పేర్కొంది. ఉదాహరణకు 185 చదరపు మీటర్ల బంకర్ ధర దాదాపు 2 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు 18 కోట్లు ఉంటుంది. పెద్ద బంకర్ల ధర 20 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు 180 కోట్ల వరకు ఉండవచ్చని తెలిపింది. ఈ బంకర్లలో నీరు, ఆహారం, విద్యుత్, వైద్య సౌకర్యాల కొరత ఉండదని స్పష్టం చేసింది.
READ ALSO: Gurukulam : సిర్రెత్తిన సిబ్బంది.. అధికారిపై కక్షతో తాగునీటిలో పురుగుల మందు
