NTV Telugu Site icon

Citadel CEO : ఉద్యోగులకు జీవితాంతం గుర్తుండిపోయే బంపర్ ఆఫర్ ఇచ్చిన సీఈవో

Cetadel Ceo

Cetadel Ceo

Citadel CEO : సాధారణంగా చాలాకంపెనీలు తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు పండుగ వచ్చిందంటే బోనస్ ప్రకటిస్తుంది. లేదంటే కంపెనీలో భారీగా లాభాలొస్తే చిన్న పాటి గిఫ్ట్ లను ఇవ్వడం పరిపాటే. కంపెనీ పనితీరు బాగా మెరుగుపడి, స్పెషల్ డేస్ జరుపుకుంటున్నప్పుడు నమ్మకంగా కష్టించి పని చేసిన ఉద్యోగులకు బైకులు, కార్లు ఇస్తుంటాయి. కానీ అమెరికాలోని ఓ కంపెనీ మాత్రం ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కంపెనీ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులకు వాళ్ల జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చింది.

Read Also: Children Missing : తిరుపతిలో నలుగురు చిన్నారుల మిస్సింగ్.. గాలిస్తున్న పోలీసులు

అమెరికాలోని సిటాడెల్ సీఈఓ కెన్నెథ్ సి. గ్రిఫిన్ త‌మ కంపెనీ 20వ‌ వార్షికోత్సవం సంద‌ర్భంగా ఉద్యోగుల‌కు ఖ‌రీదైన టూర్ ప్యాకేజీకి డ‌బ్బులు చెల్లించారు. దాంతో, వాళ్లంతా ఫ్యామిలీతో క‌లిసి మూడు రోజులు ఫ్లోరిడాలోని వాల్ట్‌డిస్నీలో స‌ర‌దాగా గడిపేందుకు అవకాశం కల్పించారు. అలాగ‌ని ప‌దిమంది వంద‌మందికి కాదు.. ఏకంగా 10వేల మంది ఉద్యోగుల‌కు. అది కూడా సొంత డ‌బ్బుతో. ఉద్యోగుల విమాన టికెట్లు, హోట‌ల్ బుకింగ్స్‌, పార్కింగ్ టికెట్లు అన్నిటికీ గ్రిఫిన్ ముందుగానే డ‌బ్బులు చెల్లించినట్లు సిట‌డెల్ అధికార ప్రతినిధి వెల్లడించారు.

Read Also: Ram Gopal Varma: 400 మంది అమ్మాయిలతో సెక్స్ చేశా.. అందులో బాగా ఎవరు నచ్చారంటే..?

అంతేకాదు ఉద్యోగులు ఎంజాయ్ చేసేందుకు ఫేమస్ రాక్ బ్యాండ్ ఈవెంట్‌ను కూడా గ్రిఫిన్ ఏర్పాటు చేశారు. బ్రిట‌న్‌కు చెందిన కోల్డ్ ప్లే రాక్‌బ్యాండ్ ప్రదర్శన ఇవ్వనుంచి. ఈ మూడు రోజులు ఫ్యామిలీతో వాల్ట్ డిస్నీ వ‌ర‌ల్డ్‌లో ఎంజాయ్ చేసే అవ‌కాశం రావ‌డంతో సిటాడెల్ ఉద్యోగులు చాల ఆనందంగా ఉన్నారు. గ్రిఫిన్‌కు 60 బిలియ‌న్ డాల‌ర్ల ఆస్తులు ఉన్నాయి. న‌వంబ‌ర్ నెల‌లో ఆయ‌న వెల్లింగ్టన్ ఫండ్ 32 శాతం లాభం వ‌చ్చింది. దాంతో, కంపెనీ విజ‌యానికి పాటుప‌డిన ఉద్యోగులకు భారీ టూర్ ప్యాకేజీ ప్రకటించారు.