Traffic Challan: హెల్మెట్ పెట్టుకోనందుకు లక్ష చలానా.. ఎక్కడో తెలుసా?
- హెల్మెట్ పెట్టుకోనందుకు లక్ష చలానా
- షాక్ తిన్న వాహనదారుడు
- బైక్ ధరే 65 వేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1 Lakh Challan in Bihar: వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించటం తరుచూ జరుగుతుంటుంది. హెల్మెట్ పెట్టుకోకుంటే రూ.500 నుంచి 1000 వరకు ఉంటుంది. అయితే హెల్మెట్ పెట్టుకోలేదని ఓ వాహనదారుడికి ట్రాఫిక్ పోలీసులు ఏకంగా లక్ష చలానాను జారీ చేశారు. లక్ష చలానా చెల్లించాలని ఫోన్‌కు వచ్చిన సందేశంను చూసి అతడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఈ ఘటన బీహార్‌లోని సుపాల్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం… మహ్మద్ అఫ్రోజ్ ఆలం అనే వ్యక్తి గత ఆగస్టు 4న హెల్మెట్ లేకుండా సుపాల్‌లో ప్రయాణించాడు. డిగ్రీ కాలేజ్ చౌక్‌లో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకుండా వెళుతున్న అఫ్రోజ్ బైక్ ఫోటో తీశారు. ఆ సమయంలో రూ.1,000 చలానా విధించారు. కొన్నిరోజులకు అఫ్రోజ్ మొబైల్‌కు రూ.1,01,000 చలానా కట్టాలంటూ మెసేజ్ వచ్చింది. ఇది చూసిన అతడి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అయినా కూడా ఇప్పటివరకు చలానాలో సవరణ జరగలేదు. అఫ్రోజ్ చలానాకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Also Read
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
- 8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
Also Read: Gold Rate Today: పండగ వేళ శుభవార్త.. తులం బంగారంపై ఏకంగా 760 తగ్గింది! భారీగా పడిపోయిన వెండి
ఈ చలానాను సుపాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కృష్ణబలి సింగ్ జారీ చేసినట్లు తెలుస్తోంది. హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు రూ.1000 జరిమానా విధించగా.. పొరపాటుగా రూ.1,01,000గా పడిందట. ఇది మానవ తప్పిదమని జిల్లా రవాణా అధికారి శశిశేఖరం పేర్కొన్నారు. 2014లో సుమారు రూ.65 వేలకు తన బైక్‌ను కొనుగోలు చేశానని.. రూ.1,01,000 చలానా ఉందని మహ్మద్ అఫ్రోజ్ ఆలం చెప్పాడు. తనది పేద కుటుంబం అని, అధికారులు త్వరగా చలానాను సవరించాలని కోరాడు.
తాజావార్తలు
-
Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!