NTV Telugu Site icon

Traffic Challan: హెల్మెట్‌ పెట్టుకోనందుకు లక్ష చలానా.. ఎక్కడో తెలుసా?

1 Lakh Challan Bihar

1 Lakh Challan Bihar

1 Lakh Challan in Bihar: వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించటం తరుచూ జరుగుతుంటుంది. హెల్మెట్‌ పెట్టుకోకుంటే రూ.500 నుంచి 1000 వరకు ఉంటుంది. అయితే హెల్మెట్‌ పెట్టుకోలేదని ఓ వాహనదారుడికి ట్రాఫిక్‌ పోలీసులు ఏకంగా లక్ష చలానాను జారీ చేశారు. లక్ష చలానా చెల్లించాలని ఫోన్‌కు వచ్చిన సందేశంను చూసి అతడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఈ ఘటన బీహార్‌లోని సుపాల్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం… మహ్మద్ అఫ్రోజ్ ఆలం అనే వ్యక్తి గత ఆగస్టు 4న హెల్మెట్‌ లేకుండా సుపాల్‌లో ప్రయాణించాడు. డిగ్రీ కాలేజ్ చౌక్‌లో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్‌ లేకుండా వెళుతున్న అఫ్రోజ్ బైక్ ఫోటో తీశారు. ఆ సమయంలో రూ.1,000 చలానా విధించారు. కొన్నిరోజులకు అఫ్రోజ్ మొబైల్‌కు రూ.1,01,000 చలానా కట్టాలంటూ మెసేజ్ వచ్చింది. ఇది చూసిన అతడి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అయినా కూడా ఇప్పటివరకు చలానాలో సవరణ జరగలేదు. అఫ్రోజ్ చలానాకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Also Read: Gold Rate Today: పండగ వేళ శుభవార్త.. తులం బంగారంపై ఏకంగా 760 తగ్గింది! భారీగా పడిపోయిన వెండి

ఈ చలానాను సుపాల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ కృష్ణబలి సింగ్‌ జారీ చేసినట్లు తెలుస్తోంది. హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు రూ.1000 జరిమానా విధించగా.. పొరపాటుగా రూ.1,01,000గా పడిందట. ఇది మానవ తప్పిదమని జిల్లా రవాణా అధికారి శశిశేఖరం పేర్కొన్నారు. 2014లో సుమారు రూ.65 వేలకు తన బైక్‌ను కొనుగోలు చేశానని.. రూ.1,01,000 చలానా ఉందని మహ్మద్ అఫ్రోజ్ ఆలం చెప్పాడు. తనది పేద కుటుంబం అని, అధికారులు త్వరగా చలానాను సవరించాలని కోరాడు.