Site icon NTV Telugu

Bihar Elections 2025: బీహార్‌లో షాకింగ్.. రోడ్డుపై VVPAT స్లిప్పులు లభ్యం..! ఈసీపై అనుమానాలు..?

Bihar

Bihar

Bihar Elections 2025: బీహార్‌ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లా సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కెఎస్ఆర్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన పెద్ద సంఖ్యలో వీవీపీఏటీ స్లిప్పులు కనిపించాయి. దీంతో ఎన్నికల ప్రక్రియ, పారదర్శకత, ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ప్రశ్నించింది. “సమస్తిపూర్‌ సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కెఎస్ఆర్ కళాశాల సమీపంలో రోడ్డుపై ఈవీఎంల నుంచి పెద్ద సంఖ్యలో వీవీపీఏటీ స్లిప్పులు విసిరేశారు. ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఎవరి ఆదేశం మేరకు ఈ స్లిప్పులు విసిరేశారు..? కమిషన్ దీనికి సమాధానం ఇస్తుందా? బయటి నుంచి వచ్చి బీహార్‌లో మకాం వేసిన ప్రజాస్వామ్య దొంగ ఆదేశం మేరకు ఇదంతా జరుగుతుందా?” అని ప్రశ్నించింది.

READ MORE: IND vs AUS 5th T20: వర్షం కారణంగా రద్దైన గబ్బా T20 మ్యాచ్.. సిరీస్ భారత్ కైవసం

ఈ అంశంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ సత్వర చర్యలు తీసుకున్నారు. నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి (ARO)ను సస్పెండ్ చేశారు. ఆయనపై FIR నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. సమస్తిపూర్ జిల్లా ఎన్నికల అధికారి (జిల్లా మేజిస్ట్రేట్) సంఘటన స్థలాన్ని సందర్శించి, దర్యాప్తు చేసి, నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ VVPAT స్లిప్‌లను మాక్ పోల్ సమయంలో ఉపయోగించారని, ARO నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎన్నికల సంఘం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇది వాస్తవ ఓటింగ్ ప్రక్రియ సమగ్రతను ప్రభావితం చేయలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు అభ్యర్థులందరికీ జిల్లా మేజిస్ట్రేట్ సమాచారం అందించింది.

READ MORE: Motorola Edge 50 pro: మోటరోలా ఫోన్ పై క్రేజీ డీల్.. రూ.36 వేల ఫోన్ రూ.23 వేలకే.. కర్వ్డ్ డిస్ప్లేతో

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ నవంబర్ 6న జరిగింది. సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలో సైతం పోలింగ్ నిర్వహించారు. EVMలు, VVPATల పనితీరును పరీక్షించేందుకు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి ప్రతి పోలింగ్ బూత్‌లో మాక్ పోల్స్ నిర్వహిస్తారు. ఓటింగ్ పూర్తయిన రెండు రోజుల తర్వాత, శీతల్‌పట్టి గ్రామంలోని చెత్తలో VVPAT స్లిప్‌లు కనిపించాయి. మహా కూటమిలోని పార్టీలు ఈ అంశంపై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నాయి. వివాదం తీవ్రమవుతున్నట్లు గమనించిన సమస్తిపూర్ జిల్లా మేజిస్ట్రేట్ రోషన్ కుష్వాహా, పోలీసు సూపరింటెండెంట్ అరవింద్ ప్రతాప్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని, ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని ప్రతిపక్ష పార్టీలకు హామీ ఇచ్చారు.

Exit mobile version