Bihar Elections 2025: బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లా సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కెఎస్ఆర్ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన పెద్ద సంఖ్యలో వీవీపీఏటీ స్లిప్పులు కనిపించాయి. దీంతో ఎన్నికల ప్రక్రియ, పారదర్శకత, ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ప్రశ్నించింది. "సమస్తిపూర్ సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కెఎస్ఆర్ కళాశాల సమీపంలో రోడ్డుపై ఈవీఎంల నుంచి పెద్ద సంఖ్యలో వీవీపీఏటీ స్లిప్పులు విసిరేశారు. ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఎవరి ఆదేశం మేరకు ఈ స్లిప్పులు విసిరేశారు..?…