Bridge Collapse: చూస్తుండగానే కుప్పకూలిన బ్రిడ్జీ.. రూ.కోట్లు నీళ్ల పాలు.. వారంలో రెండో ఘటన
- బిహార్‌లో కుప్పకూలిన మరో బ్రిడ్జీ
- కూలిన గండక్ కెనాల్‌పై నిర్మించిన వంతెన
- నిలిచిపోయిన పలు గ్రామాలకు రాకపోకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bridge Collapse: బీహార్‌లో మరో వంతెన కూలింది. సివాన్ జిల్లాలోని గండక్ కెనాల్‌పై నిర్మించిన వంతెన శనివారం కుప్పకూలింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. వంతెన కూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ వంతెన పాతదని ఓ అధికారి తెలిపారు. వంతెన కూలిపోవడంతో సమీపంలోని డజన్ల కొద్దీ గ్రామాలతో కనెక్టివిటీ కోల్పోయింది. జిల్లాలోని దారుండా బ్లాక్‌లోని రామ్‌గర్హ పంచాయతీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం.. వంతెన చాలా పాతది చెబుతున్నారు.
Read Also:Hungary Govt: మీకు కనీసం నలుగురు పిల్లలుంటే.. జీవితాంతం ట్యాక్స్ కట్టొద్దు..
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
29 ఏళ్ల క్రితం బీహార్ ప్రభుత్వం ఈ వంతెనను నిర్మించిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ శాఖ కొద్ది రోజుల క్రితం కాలువను శుభ్రం చేసింది. అలాగే కాల్వలోని మట్టిని తవ్వి కాల్వ కట్టపై పోశారు. దీంతో వంతెన పునాది బలహీనంగా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు. బ్రిడ్జి తెగి కాలువలో పడిపోయింది. ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయంపై ప్రతిపక్షాలు నితీష్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. రాష్ట్రీయ జనతాదళ్ సోషల్ మీడియా వేదికగా.. ప్రతి వారం ఏదో ఒక వంతెన కూలిపోవడం 100శాతం ఖాయం అని రాసుకొచ్చారు.
देख लीजिए डबल इंजन की सरकार के कारनामे!
हर हफ्ते कोई ना कोई पुल गिरना 100% तय ही माना जाता है!
कमीशनखोरी, अफसरशाही और भ्रष्टाचार का ऐसा दुर्लभ प्रदर्शन दुनिया में और कहीं नहीं दिखेगा!
सिवान: pic.twitter.com/LEtlsCafEJ
— Rashtriya Janata Dal (@RJDforIndia) June 22, 2024
Read Also:Budget 2024: రాష్ట్రాల ఆర్థికమంత్రులతో నిర్మలా సీతారామన్ సమావేశం..(వీడియో)
వంతెన కూలిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గండక్ కాలువపై నిర్మించిన ఈ వంతెన మహారాజ్‌గంజ్ బ్లాక్‌లోని పటేధి బజార్.. దారుండా బ్లాక్‌లోని రామ్‌గఢ్ పంచాయతీని కలుపుతుంది. ఈ వంతెన సహాయంతో వేలాది మంది ప్రజలు ఒక వైపు నుండి మరొక వైపుకు వెళ్లేవారు, కానీ ఇప్పుడు ప్రజలు సమీపంలోని గ్రామానికి వెళ్ళడానికి కూడా చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది. పాఠశాలకు వెళ్లేందుకు పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, తక్కువ సమయంలో ఒకవైపు నుంచి మరో వైపుకు వెళ్లే వృద్ధులు ఇప్పుడు దాటలేరని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వంతెన కూలిపోవడంతో వారు ఒకచోటి నుంచి మరోచోటుకు చాలా దూరం ప్రయాణించాల్సి రావడంతో వారి రోజువారీ పనులకు ఆటంకం ఏర్పడుతోంది. వంతెన కూలిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇటీవల అరారియాలోని బక్రా నదికి చెందిన పదరియా ఘాట్‌పై నిర్మించిన వంతెన కూడా ఒక్కసారిగా కుప్పకూలింది. బక్రా నదిపై నిర్మించిన బ్రిడ్జి ప్రారంభోత్సవం జరగకపోవడం విశేషం.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!