Bihar Madarsa: మదర్సా ముసుగులో నేర సామ్రాజ్యం? పోలీసుల సోదాల్లో విస్తుపోయే నిజాలు!
- బీహార్‌లో భారీ పోలీస్ ఆపరేషన్
- మదర్సాలో ఆయుధాల కలకలం.. ముగ్గురు అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Madarsa: బీహార్‌లోని మోతిహారి జిల్లాలో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడులు ఇప్పుడు సంచలనం సృష్టించాయి. నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో, ఒక మదర్సా ప్రాంగణంపై పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమ ఆయుధాలు, కీలక పత్రాలు లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. ఈ దాడిలో సంఘటనా స్థలం నుంచి ఒక పిస్టల్, తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏదైనా పెద్ద నేరానికి లేదా విధ్వంసానికి పాల్పడేందుకు ఇక్కడ కుట్ర జరిగినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయుధాలతో పాటు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
READ ALSO: Andhra Pradesh: ఏపీ కొత్త మ్యాప్ నిజం కాదు.. APSDMA క్లారిటీ..
Also Read
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
మోతిహారి ఎస్పీ స్వర్ణ ప్రభాత్ మాట్లాడుతూ.. ఈ మదర్సాలో ఆయుధాల క్రయవిక్రయాలు జరుగుతున్నాయని, పెద్ద నేరానికి ప్రణాళికలు రచిస్తున్నారని ముందస్తు సమాచారం అందింది. దీంతో చకియా డీఎస్పీ సంతోష్ కుమార్, ఎస్హెచ్ఓ మున్నా కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం మదర్సాపై దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్ సందర్భంగా ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలను పిలిపించి సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మదర్సా ప్రాంగణాన్ని సీల్ చేసి, భారీ భద్రతను ఏర్పాటు చేశామన్నారు. “అదుపులోకి తీసుకున్న వ్యక్తులకు ఏదైనా నేర ముఠాలతో లేదా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో లోతుగా విచారిస్తున్నాము” అని తెలిపారు. గతంలో ఇదే మదర్సా నుంచి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) తో సంబంధం ఉన్న యాకూబ్ (అలియాస్ సుల్తాన్)ను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేసింది. అయోధ్య రామమందిరంపై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టి, బెదిరింపులకు పాల్పడిన కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వారి నెట్‌వర్క్ ఎక్కడ వరకు విస్తరించింది అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నామన్నారు.
READ ALSO: Stock Market: మార్కెట్‌కు మధ్యాహ్నం నుంచి జోష్.. భారీ లాభాల్లో సూచీలు
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
-
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?