Andhra Pradesh: ఏపీ కొత్త మ్యాప్ నిజం కాదు.. APSDMA క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: 28 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త మ్యాప్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) విడుదల చేసిందని.. ఇందులో అమరావతిని ఏపీ క్యాపిటల్‌గా పేర్కొంది అంటూ సోషల్ మీడియాలో ఓ మ్యాప్ వైరల్‌గా మారింది.. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28 జిల్లాలతో కూడిన కొత్త మ్యాప్ విడుదలైనట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు 06-04-2026న విడుదల చేసిన ప్రెస్ నోట్లో సోషల్ మీడియా మరియు కొన్ని మీడియా వేదికల్లో ప్రచారంలో ఉన్న సమాచారం అసత్యమని పేర్కొంది.
Also Read
- Cyclone Arnab : కోస్తాంధ్రను వణికించనున్న 'అర్నాబ్'.. హైఅలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
- Cyclone Arnab : ఉత్తర కోస్తాకు ముంచుకొస్తున్న 'అర్ణబ్' తుఫాన్ ముప్పు..
- CM Chandrababu: ఎన్నికల్లో హింసకు వైసీపీనే కారణం.. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు..!
APSDMA ప్రకారం, తమ సంస్థ తరఫున ఎటువంటి కొత్త మ్యాప్‌ను విడుదల చేయలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న 28 జిల్లాల మ్యాప్ పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని తెలిపింది. APSDMA పేరు, లోగోను ఉపయోగించి షేర్ చేస్తున్న ఆ మ్యాప్‌కు ఎలాంటి ప్రామాణికత లేదని పేర్కొంది. ఇలాంటి ధృవీకరించని సమాచారాన్ని ప్రజలు, మీడియా సంస్థలు నమ్మకూడదని, దానిని షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని APSDMA సూచించింది. అధికారికంగా సంస్థ విడుదల చేసే సమాచారం మరియు ప్రకటనలనే పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ఈ ఘటనతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Catholic Church : చర్చిలో లైంగిక వేధింపులు.. బాధితులకు రూ.7 వేల కోట్ల పరిహారం
-
Naslen: ‘ప్రేమలు’ నస్లేన్ చేస్తున్నది డేరింగ్ స్టెప్పా? లేక పెద్ద తప్పా?
-
Scrap Shop Explosion: రామంతాపూర్ స్క్రాప్ దుకాణంలో భారీ పేలుడు.. ఒకరి పరిస్థితి విషమం
-
Cyclone Arnab : కోస్తాంధ్రను వణికించనున్న ‘అర్నాబ్’.. హైఅలర్ట్ జారీ చేసిన ఐఎండీ
-
Mann Ki Baat: ‘‘మన్ కీ బాత్’’కి 12 ఏళ్లు.. ప్రధాని మోడీ భావోద్వేగ వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?