Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Liquor Smuggling: బీహార్‌లో మద్యపాన నిషేధం అమల్లో ఉన్నప్పటికీ, మద్యం అక్రమ రవాణాకు ముఠాలు ఇప్పుడు కొత్త దారులను వెతుక్కుంటున్నాయి. పోలీసులు కన్నుగప్పేందుకు అందమైన యువతులను, మహిళలను పావులుగా వాడుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. సమస్తిపూర్‌లో నేహా అనే యువతి అరెస్ట్ అయిన ఘటన మరువకముందే, రాజధాని పట్నాలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న రియా అనే విద్యార్థిని మద్యం సీసాలతో పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటన పట్నాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పట్నా జంక్షన్ పరిసర ప్రాంతాలకు భారీగా అక్రమ మద్యం సరఫరా కాబోతోందని కొత్వాలి ఏఎస్పీ (లా అండ్ ఆర్డర్) కృష్ణ మురారి ప్రసాద్‌కు గుప్త సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్టేషన్ పరిసరాల్లో నిఘా తీవ్రం చేశారు. అదే సమయంలో బైక్‌పై వెళ్తున్న రియాతో పాటు కొందరు యువకులను అనుమానంతో ఆపి తనిఖీ చేశారు. తనిఖీల్లో రియా వద్ద ఉన్న హ్యాండ్‌బ్యాగ్, షోల్డర్ బ్యాగ్‌లలో దాదాపు రూ.14,000 విలువైన అర డజనుకు పైగా విదేశీ బ్రాండెడ్ మద్యం సీసాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పట్నాకు చెందిన రియా ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి అని, ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోందని తెలిసింది. కేవలం సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశ చూపించడంతోనే తాను ఈ పనికి ఒప్పుకున్నట్లు ఆమె స్పష్టం చేసింది. తనకు తెలిసిన ఒక యువకుడు డబ్బులు ఇస్తానని ఆశ చూపడంతో, అతడి మాటలు నమ్మి ఉత్తరప్రదేశ్ వెళ్లి అక్కడి నుంచి రైలులో మద్యాన్ని పట్నాకు చేర్చినట్లు చెప్పింది. గతంలో తానెప్పుడూ ఇలాంటి పనులు చేయలేదని, కేవలం డబ్బుల ఆశతో మొదటిసారి మాత్రమే ఈ తప్పు చేశానని ఆమె పోలీసులకు తెలిపింది. రైలు దిగి బ్యాగులతో బయటకు రాగానే బైక్‌పై వెళ్తుండగా పోలీసులు ఆమెను పట్టుకున్నారు. ప్రస్తుతం రియాను ఈ పనికి పురికొల్పిన ఆ యువకుడి పాత్రపై పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ మద్యం ఖేప్‌ను పట్నాలో ఎవరికి అందజేయాల్సి ఉంది, ఈ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఇందులో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే విషయాలపై పోలీసులు పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు.
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
ఇదిలా ఉండగా, కొద్దిరోజుల క్రితమే సమస్తిపూర్‌లో నేహా అనే యువతిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఢిల్లీ నుంచి ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీలో బ్రాండెడ్ మద్యం సీసాలను తన బావతో కలిసి బీహార్‌కు తరలిస్తుండగా పట్టుబడింది. నేహా కుటుంబం మొత్తానికి ఈ దందాలో హస్తం ఉందని, వారు ప్రముఖ డాక్టర్లు, సంపన్నులకే ప్రధానంగా ఈ మద్యాన్ని సరఫరా చేసేవారని విచారణలో తేలింది. ఒకదాని తర్వాత ఒకటిగా వెలుగుచూస్తున్న ఈ ఘటనలు బీహార్‌లో మద్యం మాఫియా ఏ స్థాయిలో యువతను, మహిళలను వాడుకుంటోందో కళ్ళకు కడుతున్నాయి.
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!