NTV Telugu Site icon

Bihar: విరిగిన కాలుకు ప్లాస్టర్ బదులుగా అట్టపెట్టె.. ఇదేం వైద్యం రా.. బాబు

Bihar

Bihar

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాలు విరిగిందని ఆస్పత్రికి వచ్చిన యువకుడికి వైద్యులు మాములు వైద్యం చేయలేదు. విరిగిన కాలుకు ప్లాస్టర్‌కు బదులు అట్టపెట్టను కట్టి చికిత్స చేశారు. ఈ ఘటన మినపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నితీశ్ కుమార్ అనే యువకుడు బైక్ పై నుంచి కిందపడటంతో అతని కాలుకు గాయమైంది. ఈ క్రమంలో మినపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు వినూత్నంగా కాలికి అట్టపెట్టె కట్టారు. అంతేకాకుండా.. వైద్యం కోసం ఆస్పత్రిలో చేరిన యువకుడిని పట్టించుకున్న నాథుడే లేడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రిలో ఐదు రోజుల పాటు ఉంటే ఏ వైద్యులు అతని దగ్గరికి రాలేదని చెబుతున్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు.. యువకుడిని ముజఫర్‌పూర్‌లోని సమీపంలోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ&హాస్పిటల్ కి తరలించారు.

Read Also: Saripodhaa Sanivaaram: “గరం.. గరం..” అంటూ రాబోతున్న నాని ‘సరిపోదా శనివారం’ ఫస్ట్‌ సింగిల్‌..

కాగా.. యువకుడు ఆసుపత్రిలో ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఆ యువకుడు ఒక గదిలో మంచం మీద పడుకుని, అరిగిపోయిన కట్టుతో అతని కాలికి కార్డ్‌బోర్డ్ షీట్ కట్టి ఉన్నట్లు చూపిస్తుంది. ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విభా కుమారి స్పందించారు. రోగికి త్వరలో మెరుగైన చికిత్స అందిస్తామని.. యువకుడు ఆస్పత్రికి తీసుకు రావాలని వైద్యులకు సూచించారు. యువకుడి కాలుకు అట్టపెట్టెను ఎందుకు కట్టారంటూ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదురోజుల పాటు కార్డ్‌బోర్డ్ స్ప్లింట్‌ను ప్లాస్టర్‌తో ఎందుకు మార్చలేదని మండిపడ్డారు. ఈ పని చేసిన వారిపై చర్యలు ఉంటాయని సూపరింటెండెంట్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.

Read Also: Budget Meetings : ఈనెల 18 నుంచి శాఖల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు