NTV Telugu Site icon

Vaibhav Suryavanshi: 12 ఏళ్ల వయసులోనే అరంగేట్రం.. రికార్డుల్లో బీహార్ ఆటగాడు!

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi

Bihar Cricketer Vaibhav Suryavanshi created history in Ranji Trophy 2023-24: బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులో రంజీ ట్రోఫీ‌లో అరంగేట్రం చేసి.. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన నాలుగో అతి పిన్నవయస్కుడైన భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా శుక్రవారం (జనవరి 5) ముంబైతో మొదలైన మ్యాచ్‌లో వైభవ్ బీహార్‌ తరఫున బరిలోకి దిగాడు. 1942–43 సీజన్‌లో 12 ఏళ్ల 73 రోజుల వయసులో రాజ్‌పుతానా తరఫున అరంగేట్రం చేసిన అలీముద్దీన్‌కు అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు ఉంది.

బీహార్‌కు చెందిన ఎస్‌కే బోస్ 12 సంవత్సరాల 76 రోజుల వయస్సులో 1959–60 సీజన్‌లో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. మొహమ్మద్‌ రంజాన్‌ 1937 సీజన్‌లో 12 ఏళ్ల 247 రోజుల వయసులో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ ముగ్గురు వైభవ్‌ సూర్యవంశీ కంటే చిన్న వయసులోనే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. అయితే ఓ ఇంటరాక్షన్‌లో సూర్యవంశీ తన పుట్టినరోజు సెప్టెంబర్ 27న అని, 2023లో తనకు 14 ఏళ్లు నిండుతాయని పేర్కొన్నాడు.

Also Read: TS Traffic E-Challan: పెండింగ్ చలానా రాయితీ గడువు మరో ఐదు రోజులే!

వైభవ్ సూర్యవంశీ రంజీ అరంగేట్రానికి ముందు 2023 ఎడిషన్‌ కూచ్‌ బెహార్‌ ట్రోఫీలో బీహార్‌ తరఫున ఆడాడు. జార్ఖండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో వైభవ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో 151, 76 రన్స్ చేశాడు. వైభవ్‌కు విధ్వంసకర బ్యాటర్‌గా పేరుంది. ముంబైతో జరిగే రంజీ మ్యాచ్‌లో వైభవ్‌ ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ముంబై తొలి రోజు ఆట ముగిసే సమయానికి 67 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.