NTV Telugu Site icon

Boat Capsized : మానేరులో పడవ మునక.. ఏడుగురు గల్లంతు

Maner

Maner

Boat Capsized : బీహార్‌లోని పాట్నాలో నదిలో పడవ బోల్తా పడటంతో పెను ప్రమాదం చోటుచేసుకుంది. మీడియా కథనాల ప్రకారం, పాట్నా జిల్లాలోని మానేర్ వద్ద శుక్రవారం నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదం తర్వాత ఏడుగురు గల్లంతైనట్లు సమాచారం. పడవలో 14 మంది ఉన్నారు. ఏడుగురిని సురక్షితంగా రక్షించగా, మరో ఏడుగురు గల్లంతైనట్లు పోలీసు అధికారి తెలిపారు.

Read Also: Accused Caught after 28 Years : 28ఏళ్ల తర్వాత పట్టుబడ్డ నిందితుడు… పోలీసులు ఎలా గుర్తించారంటే

పడవ మునక గురించిన సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉందని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

Show comments