Biggest Cemetery : జీవితంలో ఎన్ని బాధలు అనుభవించిన.. ప్రతి ఒక్కరూ చావులో ప్రశాంతత కోరుకుంటారు. అందుకే ప్రశాంత ప్రదేశంలో తనను ఖననం చేయాలని కోరుకుంటారు. కానీ పెరుగుతున్న జనాభా కారణంగా ప్రస్తుతం ఖననం చేసేందుకు భూమి కరువైంది. ఒకరిని పూడ్చిన చోటే మరొకరిని కొంత కాలం తర్వాత పూడ్చడం చాలా ప్రదేశాల్లో జరుగుతోంది. దీంతో చావులోనూ మనిషికి ప్రశాంతత లేకుండా పోతుంది. ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న జనాలు, మరణించిన తర్వాత వారిని పూడ్చేందుకు ఎకరాల కొద్ది స్థలం కావాల్సి వస్తోంది. దీంతో శ్మశానవాటికల విస్తీర్ణం పెరుగుతోంది. ఆ క్రమంలోనే కొన్ని ప్రదేశాలు ప్రపంచంలోనే అతి పెద్ద శ్మశాన వాటికలుగా మారుతున్నాయి. అలాంటిదే ఓ శ్మశాన వాటిక ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మన దేశంలో కాశీ రెండో స్థానంలో నిలిచింది.
ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానవాటిక ఇరాక్‌లోని నజాఫ్ నగరంలో ఉంది. ఈ శ్మశానవాటిక పేరు వాడి అల్ సలామ్ అంటే ‘శాంతి లోయ’. ఇది షియా వర్గానికి చెందిన ప్రజలకు పవిత్ర నగరం. దాని మతపరమైన ప్రాముఖ్యత కారణంగా చాలా మంది ఇక్కడ ఖననం చేయాలని కోరుకుంటారు. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్)తో ఘర్షణలు పెరిగిన తర్వాత ఈ నగరంలో ప్రతిరోజూ మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది. గతంలో రోజుకు 120 నుంచి 150 మంది ఖననం చేయగా ఇప్పుడు 200 మందికి పెరిగింది.
Read Also:Trains Cancelled: ఏపీ, తెలంగాణా రైలు ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు
ఇస్లామిక్ స్టేట్‌తో వివాదం పెరిగినప్పటి నుండి మృతదేహాలను ఖననం చేసే ప్రక్రియ చాలా ఖరీదుగా మారింది. ఇరాక్‌లోని ఈ ప్రాంతంలో ఐఎస్‌కు పట్టు ఉంది. ఇప్పుడు దీని కోసం ప్రజలు మునుపటి కంటే రెట్టింపు మొత్తాన్ని చెల్లించాలి. అయినా వారికి స్థలం లభించడం లేదు. ప్రామాణిక 25 చదరపు మీటర్ల కుటుంబ సమాధి స్థలం ఖరీదు దాదాపు 5 మిలియన్ ఇరాకీ దినార్‌లకు (సుమారు రూ. 3.3 లక్షలు) చేరుకుంది. ఈ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్, పారామిలటరీ బలగాల మధ్య ప్రతిరోజూ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.
ముహమ్మద్ ప్రవక్త అల్లుడు అయిన ఇమామ్ అలీ బిన్ అబీ తాలిబ్ సమాధికి సమీపంలో ఉన్నందున శ్మశానవాటికకు మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది. మత విశ్వాసాల కారణంగా, ప్రజలు తమ బంధువులను దాని చుట్టూ పాతిపెట్టాలని కోరుకుంటారు. షియా పారామిలిటరీలు ఇప్పటికీ ఐఎస్‌తో పోరాడేందుకు వెళ్లినప్పుడు సంప్రదాయంగా అలీ బంగారు గోపురం ఆలయాన్ని సందర్శిస్తారు. దీనితో పాటు ఈ సైనికులు కూడా విజయం కోసం లేదా మరణిస్తే అక్కడే ఖననం చేయమని ప్రార్థిస్తారు.
Read Also:Bangladesh : ఘోర ప్రమాదం.. చెరువులో పడిన బస్సు..18 మంది మృతి..