Site icon NTV Telugu

BiggBoss Winner Arrested: బిగ్ బాస్ విజేత మునావర్ ఫరూఖీ అరెస్ట్.. హుక్కా తాగుతూ..?

15

15

ప్రపంచ వ్యాప్తంగా బుల్లితెరపై ఎంతోమందిని ఎంటర్టైన్ చేస్తున్న అతిపెద్ద రియాల్టీ షో ‘బిగ్ బాస్’. విదేశాల నుండి భారతదేశానికి ఈ గేమ్ షో పాకింది. భారత్ లో కూడా దీనికి విశేషమైన ఆదరణ లభించింది. ఈ షో నిర్వహణలో భాగంగా కొంతమంది సెలబ్రేటిస్ ను ఇంట్లో ఉంచి వారికి కొన్ని టాస్కులు ఇచ్చి ప్రేక్షకులను ఆనందపరుస్తున్నారు. ఇక ఈ బిగ్ బాస్ షో భారత్ లో హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మరాఠీ, మలయాళ, బెంగాలీ భాషలలో ప్రసారం అవుతోంది. ఇకపోతే ఈ షోలో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన వారు కూడా సెలబ్రిటీల హోదాతో బయటికి వెళ్తున్నారు. మరికొందరు సినిమా ఆఫర్లను కూడా దక్కించుకున్న వారు ఉన్నారు. మరికొందరైతే బయటికి వచ్చాక మాత్రం కొంతమంది వివాదాల చుట్టూ తిరుగుతూ వార్తల్లోకి ఎక్కుతున్నారు.

Also Read: Konda Surekha: కవితను అరెస్టు చేయడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు..

ఇదే విషయంపై తెలుగు బిగ్ బాస్ ఏడవ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా జరిగింది. పోలీసుల ఉత్తర్వులను పట్టించుకోకుండా ర్యాలీ చేయడం వల్ల ఆయన అరెస్టు అయిన సంగతి మనకు తెలిసిందే. ఇదివరకు హిందీలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కూడా పాముల విషాన్ని సరఫరా చేస్తున్న ఆరోపణలు సంబంధించి అరెస్టు అయ్యాడు. ఇక తాజాగా హిందీ బిగ్ బాస్ సీజన్ 17 విన్నర్ మునావర్ ఫరూఖీని తాజాగా పోలీసుల అరెస్ట్ చేశారు.

Also Read: MallaReddy: బీఆర్ఎస్ ఓడింది ఊర్లలో మాత్రమే.. హైదరాబాద్లో కాదు..

ముంబై మహానగరంలోని బూరా బజారులో ఉన్న హుక్క బార్ పై అర్ధరాత్రి రైడు నిర్వహించగా.. అందులో మునావర్ ఫరూఖీతో సహా 13 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ విషయం సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆయుర్వేదిక్ హుక్కా ముసుగులో అసలైన పొగాకుతో కూడిన హుక్కాను కష్టమర్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. నిజానికి పొగాకు హుక్కా పీల్చడం చట్టరీత్యా నేరం. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశామని పట్టుబడిన వారిని విచారించిన తర్వాత విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version