Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8 మొదట్లో కొంత ఆనాసక్తిగా అనిపించినా.. రాను రాను ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. కొత్త కాన్సెప్ట్‌లతో జనాలను ఆకట్టుకుంటోంది. ఈ షో ప్రారంభమై ఇప్పటికే మూడు వారాలు గడిచిపోయాయి. ప్రస్తుతం నాలుగో వారాంతానికి చేరుకుంది. ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా, ఇప్పుడు 11 మందితో షో నడుస్తోంది. ఇప్పుడు నాలుగో వారం పూర్తికావడంతో ఈ రోజు నాగార్జున ఎవరిని ఇంటికి పంపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సోమవారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం అర్థరాత్రి వరకు ఓటింగ్ జరిగింది. ఓటింగ్ లైన్లు ముగియడంతో ఎవరికి తక్కువ ఓట్లు వచ్చాయని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ వారం ఎలిమినేషన్‌పై పూర్తి క్లారిటీ రానుంది.
Read Also:Floods In Nepal: భారీ వరదలు.. 112 మంది మృతి.. కొట్టుకుపోయిన వందలాది మంది!
ఈ వారం కంటెస్టెంట్స్ సోనియా, పృథ్వీలు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. తక్కువ ఓట్లతో డేంజర్ జోన్‌లో ఉన్నారనే చర్చ జరుగుతోంది. నిఖిల్ అభిమానులకు సోనియా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ క్యూటీ నిఖిల్ గేమ్‌పై నెగిటివ్ గా ప్రభావితం చూపుతోంది. అందుకే ఈ వారం ఆమెను ఇంటి నుంచి గెంటేయ్యాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సోనియాపై కోపంతో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్న వారికే నిఖిల్ ఫ్యాన్స్ బాగా ఓట్లు వేస్తున్నారు. కాబట్టి మరికొందరిని కాపాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోనియా మాత్రం బలయ్యే అవకాశం ఉంది. కొన్ని మీడియా వర్గాలు నిర్వహించిన పోలింగ్ పై నిఖిల్ అభిమానులు రచ్చ స్పష్టంగా తెలుస్తోంది.
Read Also:Love Tragedy: ప్రేమ జంట ఆచూకీ కోసం అబ్బాయి అన్న వదినలు కిడ్నాప్..
ఈ వారం నామినేషన్లలో నబీల్, సోనియా, మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, ప్రేరణ, నైనికా ఉన్నారు. శక్తి క్లాన్ చీఫ్ నిఖిల్ తన స్పెషల్ పవర్ తో నైనికను నామినేషన్ల నుంచి తప్పించాడు. ఈ వారం సోనియా, పృథ్వీ, నిఖిల్‌ల పనితీరు గురించి నబీల్ చాలా మాట్లాడాడు. ఆయన మాటలు ప్రేక్షకులకు నచ్చి ఓట్లు వేశారు. సోమవారం నాటి నామినేషన్లలో నబీల్, సోనియా మధ్య పెద్ద మాటల యుద్ధం నడిచింది. దీని తర్వాత నబీల్ మొత్తం ఓట్లలో 35 శాతం సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. అతని తర్వాత మణికంఠ ఎక్కువ ఓట్లు సాధించాడు. ప్రేరణ కూడా ఈ వారం సేఫ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిత్య ఓం, పృథ్వీ, సోనియాలపై ఎలిమినేషన్ కత్తులు వేలాడుతుండగా.. నిఖిల్ అభిమానులు మాత్రం సోనియాను ఇంటికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. పృథ్వీ, ఆదిత్య ఓంల కంటే ఆమెకు తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది కానీ బిగ్ బాస్ సోనియాను కాపాడి ఆదిత్య ఓంను ఇంటికి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఉంటేనే కంటెంట్ ఉంటుందని బిగ్ బాస్ భావిస్తున్నారని, ఓటింగ్ తో సంబంధం లేకుండా మరోసారి ప్రేక్షకులను సోనియాను సేవ్ చేసి అలరించేందుకు సిద్ధమయ్యారని సమాచారం.