Bigg Boss 9 Winner: మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే జరగబోతుంది. తెలుగు బిస్ బాస్ చరిత్రలో ఏ సీజన్‌లో లేని విధంగా ఈ సీజన్‌లో కామనర్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో పరీక్షలకు తట్టుకొని చివరి వరకు నిలిచిన టాప్ 5 ఆటగాళ్లు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే జరగబోతున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్ టైటిల్ రేసులో ప్రస్తుతం రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచిన చరిత్ర సృష్టించిన వాళ్లే అవుతారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: MG Motor: పెరగనున్న ఎంజీ మోటార్స్ కార్ల ధరలు.. కొత్త ధరలు ఆ రోజు నుంచే అమల్లోకి
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో టాప్ 5 ఆటగాళ్లుగా తనూజ, కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, డిమాన్ పవన్ ఉన్నారు. ఈ టాప్ 5లో ఇద్దరి మధ్యలోనే టైటిల్ కోసం వార్ జరుగుతుందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఆ ఇద్దరిలో ఒక తనూజ, మరొకరు కళ్యాణ్ పడాల. నిజానికి కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఒక కామనర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇన్ని వారాల పోటీని తట్టుకొని, ఎలిమినేషన్‌లో నిలబడిన ప్రతీసారి ప్రేక్షకుల ఓట్లతో హౌస్‌లో కొనసాగుతూ, ప్రస్తుతం బిగ్ బాస్ టాప్ 5 ఆటగాళ్లలో ఒకరిగా ఉన్నాడు. ఇక పోతే తనూజ.. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్‌లో వన్ ఆఫ్ ది టఫ్ ఫైటర్స్‌లో తనూజ ఒకరంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ ఇప్పటి వరకు 8 సీజన్లు పూర్తి చేసుకున్నా, విన్నర్స్‌లో ఒక్కరు కూడా లేడీ లేరు. బిందుమాధవి విన్నర్ అయిన అది ఓటీటీ సీజన్‌కు కావడంతో ఇప్పటి వరకు ఒక్క లేడీ కూడా ఈ టైటిల్‌ను సొంతం చేసుకోలేదు. ఒక వేళ తనూజ ఈ టైటిల్‌ను ముద్దాడితే బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ లేడీ విన్నర్‌గా అవతరిస్తుంది. ప్రస్తుతానికి ఉన్న నివేదికల ప్రకారం ఈ ఇద్దరి మధ్యలోనే టఫ్ ఫైట్ ఉన్నట్లు టాక్ నడుస్తుంది. చివరి నిమిషంలో ఓటింగ్ తారుమారైన సందర్భాలు ఎన్నో ఉంటడంతో టైటిల్‌ను ముద్దాడేది ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
READ ALSO: Ram Charan: ఢిల్లీ వీధుల్లో రామ్‌చరణ్ పెద్ది షూటింగ్.. లీకైన ఫోటోలు
