బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు ముగింపు దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలే ఉండబోతుంది. ఈ వారం ‘టికెట్ టు ఫినాలే’ గెలుచుకుని, కల్యాణ్ పడాల నేరుగా ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్‌గా నిలవడంతో, మిగతా హౌస్‌మేట్స్‌లో పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఈ వీకెండ్‌తో 13వ వారం పూర్తవుతున్న సందర్భంగా, ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో (తనుజ పుట్టస్వామి, భరణి శంకర్, సంజన గల్రాని, సుమన్ శెట్టి, డిమాన్ పవన్, రీతూ చౌదరి) ఓటింగ్ హాట్‌గా మారింది. లీకుల ప్రకారం, మొదటి నుంచి సీరియల్ హీరోయిన్ తనుజ పుట్టస్వామి ఓటింగ్‌లో తిరుగులేని విధంగా టాప్ 1 స్థానంలో దూసుకుపోతోంది.
Also Read : Allu Cinemas : దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ ఆవిష్కరణ!
ప్రస్తుత ఓటింగ్ వివరాలు టాప్ 1 మరియు 2 స్థానాల్లో తనుజ, డిమాన్ పవన్ క్షేమంగా ఉన్నప్పటికీ, మిగిలిన నాలుగు స్థానాల్లో ఉన్న భరణి శంకర్, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, సంజన గల్రాని గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఈ నలుగురూ డేంజర్ జోన్‌లోనే ఉన్నారని తెలుస్తోంది. కాగా ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని బిగ్ బాస్ వర్గాల నుంచి లీకులు వస్తున్నాయి. ఇందులో భాగంగా, ఓటింగ్ శాతం ప్రకారం చివరి స్థానంలో ఉన్న రీతూ ఎలిమినేట్ అయింది. ఇంకోక్కరు ఎవరు వెళ్తారు అనేది హోస్ట్ నాగార్జున ప్రకటించేంతవరకు సస్పెన్సే.
