Bigg Boss Telugu 8: సీన్ రివర్స్.. బిగ్‌బాస్ 8 నుంచి వేణు స్వామి అవుట్! కారణం ఆ హీరోనేనా?
- త్వరలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8
- హోస్ట్‌గా కింగ్ నాగార్జున
- బిగ్‌బాస్ నుంచి వేణు స్వామి అవుట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Is Venu Swamy Out From Bigg Boss Telugu 8: ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ తెలుగు సీజన్ 8 త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్ 8కు సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. గత కొన్ని సీజన్ల నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున ఈసారి కూడా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. సీజన్ 8 ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో త్వరలోనే తెలియరానుంది. అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్ హౌస్ సెట్‌కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు సీజన్ 8లో పాల్గొనే కంటెస్టెంట్‌ల ఎంపికపై సోషల్ మీడియాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.
బిగ్‌బాస్ సీజన్ 8 కంటెస్టెంట్‌ల లిస్ట్ ఇదే అంటూ తెరపైకి చాలా పేర్లు వచ్చాయి. అందులో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు కూడా ఉంది. అయితే మొన్నటివరకు లిస్టులో ఉన్న వేణు స్వామి పేరు.. ఇప్పుడు లేదని తెలుస్తోంది. ఇందుకు కారణం ఆయన నాగ చైతన్య, శోభిత ధూళిపాళల వైవాహిక బంధంపై సంచలన కామెంట్స్ చేయడమే అట. బిగ్‌బాస్ షోకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించడం.. ఆయన కుమారుడు, కాబోయే కోడలిపైనే వివాదాస్పద కామెంట్స్ చేయడంతో వేణు స్వామిని పక్కన పెట్టారని సమాచారం. వేణు స్వామిపై కింగ్ సహా అక్కినేని అభిమానులు కోపంగా ఉన్నారు. ఈ సమయంలో అతడిని హౌస్‌లోకి తీసురావడం కరెక్ట్ కాదని యాజమాన్యం భావిస్తోందట.
Also Read
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
Also Read: Utpalendu Chakraborty Death: ప్రముఖ డైరెక్టర్ ఉత్పలేందు చక్రవర్తి మృతి!
సాధారణంగా సోషల్ మీడియా స్టార్స్, వివాదాస్పద వ్యక్తులను బిగ్‌బాస్ హౌస్‌లోకి పిలుస్తుంటారు. అయితే జ్యోతిష్యుడు వేణు స్వామి విషయంలో మాత్రం ఇది రివర్స్ అవ్వనుంది. ఆగష్టు 8న నాగ చైతన్య, శోభిత ధూళిపాళల ఎంగేజ్‌మెంట్ కాగా.. ఆ మరుసటి రోజే వారి జాతకాలు చెప్పి అందరి ఆగ్రహానికి గురయ్యాడు. ఈ విషయంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా వేణు స్వామికి కాల్ చేసి మాట్లాడారు. ఇకనుంచి ఎవరి జాతకాలు చెప్పొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారట. చూడాలి మరి వేణు స్వామి హౌస్‌లోకి అడుగుపెడుతాడో లేదో.
తాజావార్తలు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!