Site icon NTV Telugu

Bigg Boss Telugu 7: కాళ్లు పట్టుకొని బతిమిలాడిన అశ్విని.. ఫైర్ అయిన శివాజీ

Shobha

Shobha

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. వారం మొత్తం ఎలా ఉన్నా.. సోమవారం వచ్చిందంటే నామినేషన్స్ తో హౌస్ మొత్తం హీటెక్కిపోతూ ఉంటుంది. ఇక నిన్న అందరు అనుకున్నట్లుగానే తేజ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఈ వారం నామినేషన్స్ చాలా హోరాహోరీగా జరుగుతున్నాయి. సిల్లీ రీజన్స్ నుంచి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొనేవరకు కంటెస్టెంట్స్ వెళ్లారు. ఇక ఈసారి అందరి టార్గెట్ అశ్విని అయ్యింది. ఈ వారం బిగ్ బాస్.. ఇంట్లో ఉన్న అమ్మాయిలను రాజమాతలుగా కూర్చోపెట్టి వారి ముందు నామినేషన్ ప్రక్రియ ను మొదలుపెట్టాలని చెప్పాడు. ఇక శోభ, ప్రియాంక, అశ్విని, రతిక ముందు మిగతా కంటెస్టెంట్స్ తమ తమ కారణాలు చెప్పి నామినేట్ చేశారు. ఇక వారి నామినేట్ కరెక్ట్ అయ్యింది అని రాజమాతలకు అనిపిస్తే .. వారే డైరెక్ట్ గా నామినేట్ చేశారు. ఇక అమర్, భోలే ను చేయడం.. భోలేను అమర్ నామినేట్ చేయడం జరిగింది.

Kannur Squad : ఓటీటీలోకి రాబోతున్న మమ్ముట్టి ‘కన్నూర్ స్క్వాడ్’..?

ఇక ఈ ప్రక్రియలో ప్రియాంక, శోభా.. అశ్వినిపై విరుచుకు పడ్డారు. భోలేకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నావని, ఆయన నామినేట్ అప్పుడే మాట్లాడుతున్నావని శోభా చెప్పడంతో.. అశ్విని.. తాను నోరు ఎత్తితేనే పాపం అయిపోతుందని, అందరు తనమీదనే అరుస్తున్నారని ఏడుపు లంకించుకుంది. అంతేకాకుండా.. వారితో వాదించలేక.. శోభా, ప్రియాంక కాళ్లు పట్టుకొని వదిలేయండి అమ్మా.. నేను వెళ్ళిపోతాను అని చెప్పుకొచ్చింది. ఇక ఇంకోపక్క గౌతమ్.. శివాజీ మధ్య పెద్ద రచ్చ జరిగింది. దానికి శివాజీ ఫైర్ అయ్యాడు. బయట జనాలు చూస్తున్నారు.. నిజాయితీగా లేని ఎవరినైనా బయటకు పంపండి.. అందులో నేను ఉంటే నన్ను కూడా బయటకు పంపండి అంటూ.. నామినేషన్ అంగీకరించాడు. మరి ఈ వారం ఎవరు నామినేట్ అవుతారో చూడాలి.

Exit mobile version